బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మద్య మూడవ టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా ఇవాళ ప్రారంభం అయ్యింది. తొలి రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ ప్రారంభం అయ్యే క్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది. ఇటీవలె సిరాజ్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశాడు.

 క్వారంటైన్‌ నిబంధనల కారణంగా భారత్‌కి తిరిగి  వెళ్లే అవకాశం లేనందన తన తండ్రి చివరి చూపు కూడా చూసుకోలేక ఎంతో భావోద్వేగం గురి అయ్యి బరువెక్కిన హృదయంతో జాతీయ గీతం అలపిస్తున్న క్రమం లో కంటతడి పెట్టడం ప్రతిఒక్కరినీ కూడా ఎంతో కలచివేసింది. ఇదిలా ఉండగా ఇదే మ్యాచ్ లో మరోక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ ల్లోకి ఆరంగేట్రం చేసిన పకోవ్‌స్కీ ని పెవిలియన్ చేర్చే అవకాశం ను పంత్ రెండు సార్లు జారవిడిచాడు. 

22వ ఓవర్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఒకసారి, మళ్లీ 25 ఓవర్‌లో సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో అతడికి లైఫ్‌ దొరికింది. దీంతో అతడు అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ పై సోషల్ మీడియా లో నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఆరంగేట్ర ఆటగాళ్ల మద్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అర్ధసెంచరీ(62) పూర్తి చేసుకున్న పకోవ్‌స్కీ నవదీప్‌ సైనీ బౌలింగ్‌లో 34వ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. టీమిండియా తరఫున  299వ ఆటగాడిగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సైనీ తొలి వికెట్‌గా.. ఆసీస్‌ అరంగేట్ర క్రికెటర్‌ పకోవ్‌స్కీను పెవిలియన్‌కు చేర్చడం విశేషం. ఇలా మూడవ టెస్ట్ తొలి రోజు ఆసక్తికర సంఘటనలతో ముగిసింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: