
అయితే రూట్, కోహ్లీ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ కూడా మేటి ఆటగాళ్లే. తమ జట్లలో కీలకపాత్ర వహిస్తారు ఈ ఇద్దరు ఆటగాళ్ళు. అయితే కొన్ని విషయాల్లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ కన్నా.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూటే బెటర్ అని మాజీ ఇంగ్లండ్ ఆటగాడు, దిగ్గజం మైకేల్ వాగన్ అన్నాు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్ల యావరేజీలను వాగన్ పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. అంతేకాక కోహ్లీ కన్నా రూటే బెటరని ఆధారాలతో సహా రుజువైనట్లేనని వాగన్ అభిప్రాయపడ్డాడు.
‘‘స్పిన్ బౌలింగ్‌లో రూట్ యావరేజి 70.7. అదే కోహ్లీ యావరేజి 69.0. అది కూడా ముఖ్యంగా ఆఫ్‌స్పిన్‌ను గనుక పరిగణిస్తే.. రూట్ యావరేజి 71.2 కాగా, కోహ్లీది కేవలం 53.1 మాత్రమే’’ అని వాగన్ ట్వీట్ చేశాడు. దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఎదురు చూడాలి. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య భారత్ చెన్నై వై వేదికగా మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రూట్ డబుల్ సెంచరీ సాధించగా కోహ్లీ తక్కువ స్కోరుకే పరిమితం అవుతూ ఉండడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.ఇంకా నాలుగు టెస్టులు జరగాల్సి ఉండగా ఇద్దరు ఆటగాళ్ళు ఇలాంటి ప్రదర్శనతో ఆకట్టుకుంటారు చూడాలి.