శ్రీలంక పర్యటనలో భాగంగా ఎంతో మంది యువ క్రికెటర్లు ఇక అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టి తమదైన ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ద పడుతున్నారు అయితే ఇటీవలే భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ వన్డే మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇక శిఖర్ ధావన్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడో అని అందరూ అనుకున్నారు. అయితే మొదటి వన్డే మ్యాచ్లో ఏకంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు గబ్బర్. 86 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర వహించాడు.
ఇకపోతే టీమిండియా ఇటీవలే ఒక అరుదైన ఘనత సాధించింది. వన్డే జట్టులో కీలక ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు లేకుండా భారత జట్టు దాదాపూ 1028 రోజుల తర్వాత తొలి వన్డే మ్యాచ్ ఆడటం గమనార్హం. ఇటీవల శ్రీలంక పర్యటనలో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వీరిద్దరు లేరు. అయితే వన్డే ఫార్మాట్లో జట్టును ఎంతో ముందుండి నడిపించి ఎన్నో మరపురాని విజయాలను అందించిన ఘనత ఇద్దరు ఆటగాళ్లకు ఉంది. అయితే ఇటీవలే 1028 రోజుల తర్వాత టీమిండియా జట్టు ఇద్దరు ఆటగాళ్లు లేకుండా శ్రీలంక పర్యటనలో మొదటి వన్డే మ్యాచ్ ఆడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి