ఐపీఎల్ 14 సీజన్ లో ఈ రోజు చెన్నై మరియు సన్ రైజర్స్ మధ్యన షార్జా వేదికగా జరగనుంది. టాస్ గెలిచిన ధోని మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఎలాగూ ప్లే ఆఫ్ కు చేరే అవకాశం లేని సన్ రైజర్స్ ఎంతో ఫ్రీగా ఆడనుంది. గత మ్యాచ్ లో పరుగుల వరద పారించిన జాసన్ రాయ్ నుండి మరొక్క చక్కటి ఇన్నింగ్స్ ను ఆశించవచ్చు. కానీ ఈ మ్యాచ్ లో భయంకరమైన ఫామ్ లో ఉన్న చెన్నై ను ఓడించడం అనేది జరగని పని. కానీ అవకాశాలు పూర్తిగా లేవని కొట్టిపారేయలేము. గత మ్యాచ్ లో లాగానే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్లు ఇద్దరూ జూలు విదిల్చితే చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి వారిని ఒత్తిడిలోకి నెట్టవచ్చు.

మ్యాచ్ జరిగేది షార్జా లో, ఇక్కడ బౌండరీలు కొంచెం చిన్నవి. కాబట్టి పిచ్ క్యురేటర్ కూడా భారీ స్కోర్ కు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడినా పెద్దగా కోల్పోయేదేమీ లేదు. కానీ చెన్నై కనుక ఓడిందంటే పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో ఉండడానికి కొంచెం క్లిష్టంగా మారవచ్చు. ఐపీఎల్ ఓ మొదటి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు పూర్తయ్యాక, మొదటి రెండు స్థానాలు ఎంత కీలకమో తెలిసిందే. అలాంటప్పుడు ఇక ప్రతి మ్యాచ్ చెన్నై గెలవడం ముఖ్యమే. ప్రస్తుతానికి అయితే చెన్నై ఆడిన 10 మ్యాచ్ లలో ఎనిమిది గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మిగిలిన నాలుగు మ్యాచ్ లలో కనీసం మూడు గెలిచినా మొదటి రెండు స్థానాలలో ఉంటుంది.

కాబట్టి ఈ మ్యాచ్ లో గెలవడం ధోని సేనకు అవసరం. అయితే గత మ్యాచ్ లో గెలిచి ఫుల్ రేజ్ లో ఉన్న సన్ రైజర్స్ ను నిలువరిస్తుందా లేదా మరొక గెలుపుతో మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా అన్నది చూడాలి. ఈ మ్యాచ్ లో సామ్ కరన్ బదులు బ్రేవో తుది జట్టులోకి వచ్చాడు. ఇంకో అయిదు నిముషాల్లో మ్యాచ్ మొదలు కానుంది. గెలుపు ఎవరిదో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: