విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ 2008 లో శ్రీలంకతో ఆడిన మొదటి వన్ డే మ్యాచ్ ద్వారా ప్రారంభం అయింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఒక ప్లేయర్ గా ఎన్నో రికార్డులను సాధించాడు. క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ ఒక్కడే బద్దలు కొడతాడని నమ్మకం కలిగేలా చేశాడు. ఇందులో భాగంగా ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను తిరగరశాడు. దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో మైలు రాళ్ళను అందుకున్నాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎందుకు ఎంచుకోవాలి అనే దానికి ఒక సరైన అర్థం చెప్పాడు. ఇప్పుడు ఇండియా అంతా కోహ్లీ నామం జపిస్తోంది. అంత పిచ్చిగా అభిమానులు కోహ్లి ని ప్రేమిస్తున్నారు.

అయితే ఇంతలా ఒక ప్లేయర్ గా సక్సెస్ అయిన కోహ్లీ ఒక్క విషయంలో మాత్రం విమర్శకుల నుండి ప్రశ్నలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ ఇది ఎలా జరిగిందో తెలియదు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ ఒక కెప్టెన్ వికెట్ కీపర్ గా జట్టును ఎంతో సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించాడు. అయితే ధోనీ బ్యాటింగ్ లో అంతగా ప్రభావం చూపకపోవడం మరియు వయసు మీద పడుతుండడంతో  భారత క్రికెట్ కు ధోనీ వుండగానే ఒక మంచి కెప్టెన్ ను తయారు  చేయాలనుకున్నారు బీసీసీఐ. అందులో భాగంగానే బ్యాట్స్మన్ గా ఎవ్వరికీ అందనంత దూరంలో ఉన్న విరాట్ కోహ్లీని ధోనీ వారసుడిగా ఇండియన్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. కానీ మొదటి నుండి కోహ్లీ కెప్టెన్ గా అంత సౌకర్యవంతంగా అనిపించలేదు. తనకు నచ్చిన బ్యాటింగ్ ను ఆస్వాదించలేకపోయాడు.

ప్లేయర్ గా సత్తా చాటినా...ఒక కెప్టెన్ గా మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అలా అని మ్యాచ్ లు గెలవడం లేదు అని కాదు, తన కెప్టెన్సీ తో మ్యాచ్ లు గెలిపించడంలో విఫలం అయ్యాడు. రోజు రోజుకు తన కెప్టెన్సీపై విమర్శలు రావడం ఎక్కువయ్యాయి. ఇవన్నీ భరించలేక ఈ మధ్యనే ఐపిఎల్ సెకండ్ లెగ్ జరుగుతున్న సమయంలో ఐపిఎల్  లో బెంగళూర్ కెప్టెన్ గా , అలాగే ఇండియా వన్ డే మరియు టీ 20 కెప్టెన్ గా ఈ ప్రపంచ కప్ తర్వాత తప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.  ఈ విషయం విన్న కోహ్లీ అభిమానులకు కళ్ళు చెమడ్చాయి. అయితే ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ విమర్శల కన్నా ఇదే సరైందని అనుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుని ఇంకా విమర్శల పాలయ్యారు. కాగా నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే విషయంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: