రెండు మ్యాచ్‌ ల సిరీస్‌ లో భాగంగా రేపు కాన్పూర్‌ లో ప్రారంభమయ్యే తొలి టెస్టు లో న్యూజిలాండ్‌ తో భారత్ తలపడనుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ లో ఈ ఇరు జట్లు తలపడ్డాయి, అందులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఆ గేమ్ తర్వాత సుదీర్ఘమైన ఫార్మాట్‌ లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ లో న్యూజిలాండ్‌ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత... ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్న జట్టు కొత్త ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో మొదటి సారి టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే కాన్పూర్‌ లో ఆటకు సిద్ధమవుతున్న సందర్భంగా, గ్రీన్ పార్క్ స్టేడియం లో టీం ఇండియా శిక్షణను పర్యవేక్షిస్తున్న ద్రవిడ్ కనిపించాడు.

ఆసక్తికరంగా, ద్రవిడ్ నెట్స్‌ లో బౌలింగ్ బాధ్యతలను స్వీకరించాడు మరియు కొన్ని ఆఫ్ స్పిన్ డెలివరీలను ప్రయత్నించడం కనిపించింది. ద్రవిడ్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ తో జట్టు బ్యాటర్లను సిద్ధం చేస్తున్న వీడియోను భారత క్రికెట్ జట్టు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో షేర్ చేసింది. అయితే న్యూజిలాండ్‌ తో సిరీస్‌ లో భారత్ కొంతమంది ఆటగాళ్లను కోల్పోతుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోనున్నాడు మరియు కాన్పూర్‌ లో జరిగే రెండవ టెస్టులో జట్టు తో చేరనున్నాడు. కోహ్లీ గైర్హాజరీ తో తొలి టెస్టులో అజింక్య రహానే జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. ఇక రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ షమీ మరియు బుమ్రా కూడా నెలల తరబడి బయో బబుల్స్‌లో గడిపిన కారణంగా వారికి విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు, కేఎల్ రాహుల్ ఎడమ తొడపై కండరాల ఒత్తిడి కారణంగా మొత్తం సిరీస్‌ కు దూరమయ్యాడు.మరింత సమాచారం తెలుసుకోండి: