భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించాలని అనుకుంది. టెస్ట్ సిరీస్లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు చివరికి టెస్టు సిరీస్లో ఓడిపోయింది భారత జట్టు. ఆ తర్వాత వన్డే సిరీస్లో అయినా సరే గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంది. కానీ ఏం చేస్తాం వన్డే సిరీస్ కూడా టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను చేజార్చుకుంది. ఇక ఆ తర్వాత కనీసం మూడో వన్డేల్లో అయినా గెలుస్తుంది అనుకుంటే మూడో వన్డేలో కూడా అదే పేలవ ప్రదర్శనతో ఓటమి చవిచూసింది.


 దీంతో వన్డే సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా క్లీన్స్వీప్ అయింది టీమిండియా. ఇప్పటివరకు ఒక్క సారి కూడా సౌతాఫ్రికా పర్యటన లో టీమిండియా ఇలా క్లీన్ స్వీప్ అయిన సందర్భాలు లేవు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కె.ఎల్.రాహుల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. అతని కెప్టెన్సీ కారణంగానే టీమిండియా ఓడిపోయింది అంటూ అందరూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. జట్టులో సమతౌల్యం  లోపించింది అన్నది నిజమే అంటూ అంగీకరించాడు రాహుల్ ద్రవిడ్. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా జట్టులో లేని లోటు వన్డే సిరీస్ లో స్పష్టంగా తెలిసింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు రాహుల్ ద్రవిడ్.  భారత జట్టు వన్డే సిరీస్లో విఫలమైనప్పటికీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై మాత్రం ప్రభావం చూపబోదని అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఆరు, ఏడు ఎనిమిది స్థానాలలో ఆల్రౌండ్ ప్రదర్శన చేసే వారు అందుబాటులో లేరు. రానున్న రోజుల్లో ఇలాంటి వారు జట్టులోకి వస్తారూ అని అనుకుంటున్నాను.. ఇలా ఆల్రౌండర్లు అందుబాటులో ఉంటే మరింత భిన్నంగా ఆడేందుకు టీమిండియాకు అవకాశం ఉంటుంది అంటూ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: