ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో గడుస్తున్నా పరిస్థితుల దృష్ట్యా ఒక డిబేట్ కు ఆస్కారం ఏర్పడింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా పర్యటనలో దారుణంగా ఫెయిల్ అయిన టీమిండియా పట్ల ప్రపంచం లోని మాజీ క్రికెటర్లు అందరూ విమర్శలు చేస్తున్నారు. దీనితో కొత్త కోచ్ గా ఎంపిక అయిన రాహుల్ ద్రావి పనితీరుపై అప్పుడే ప్రశ్నలు మొదలైపోయాయి. అంతే కాకుండా గత కోచ్ గా ఉన్న రవిశాస్త్రి కి మరియు రాహుల్ ద్రావిడ్ కి మధ్య కొన్ని విషయాల గురించి చర్చిస్తున్నారు.

* మాజీ కోచ్ రవి శాస్త్రి తన ఆలోచనలో అయినా, ఆటగాళ్లతో మాట్లాడే సందర్భంలో అయిన చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుత కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ మాత్రం బ్యాటింగ్ లో ఎలా అయితే ప్రశాంతంగా ఆడుతాడో... కోచ్ గా కూడా చాలా కామ్ గా తనపని తాను చేసుకు పోతూ ఉండే స్వభావం కలవాడు.

* రవిశాస్త్రి ఆటగాళ్ల నుండి సరైన ఆటను రాబట్టుకోవడానికి వివిధ మెళకువలను ఇవ్వగలడు మరియు ఎప్పటికప్పుడు వారిలోని పొరపాట్లను సెట్ రైట్ చేస్తాడు. కానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక ప్లేయర్ కి పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. అనవసరం అయిన సలహాలు ఇస్తూ వారిని ఇబ్బంది పెట్టకుండా ఇలా చేస్తుంటాడు. అయితే కొన్ని సార్లు ఇది వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

* రవిశాస్త్రి యొక్క విన్నింగ్ రికార్డును గమనిస్తే మొత్తం 43 టెస్ట్ లకు గాను కేవలం 25 మాత్రమే గెలిచారు. 76 వన్ డే మ్యాచ్ లలో 51 మ్యాచ్ లను గెలిపించాడు. ఇక రాహుల్ ద్రావిడ్ విషయానికి వస్తే తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆరు నెలలు మాత్రమే కావడంతో ఇప్పుడే ఒక అంచనాకు రాలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం వరకు చూస్తే రాహుల్ ద్రావిడ్ తన స్టామినా నిరూపించలేదని చెప్పాలి.  

* అయితే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కు మంచి అవకాశం. రవిశాస్త్రి ఏవైతే సాధించలేకపోయాడో వాటిని సాధించి తానేంటో ప్రూవ్ చేసుకోవాలి.

మరి చూద్దాం భవిష్యత్తులో ఇండియన్ టీమ్ ను ఏ విధంగా తీర్చిదిద్దుతాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: