బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రతి సీజన్లో కూడా అంతకంతకు క్రేజ్ పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో లీగ్ లు వచ్చినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తప్ప మిగతావి అంతగా సక్సెస్ కాలేదు. అంతే కాదు ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. కేవలం మన దేశంలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో సైతం ఐపీఎల్ కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీంతో ఇక ఐపీఎల్ బ్రాండ్ విలువ అంతకంతకూ పెరుగుతోంది.


 ఐపీఎల్ ప్రారంభ మవుతుంది అంటే చాలు ఇక ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది మాదిరిగానే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ప్రమోషన్స్ లోకి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఐపీఎల్ 2021 కోసం ఇంటింటికి తిరిగి సందడి చేసిన మహేంద్ర సింగ్ ధోని ఈసారి ఏకంగా బస్సు డ్రైవర్ గా మారిపోయాడు. సౌత్ ఇండియన్ లుక్ లో కనిపించి అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు.


 అయితే ఇక ఇలా ప్రమోషన్స్ చేయడం అయితే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది అని అర్థమవుతుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మహేంద్రసింగ్ ధోని బస్సు నడుపుతూ వెళ్తున్న సమయంలో ఒక షాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లైవ్ వస్తూ ఉంటుంది. అయితే అది చూసిన మహేంద్రసింగ్ ధోని బస్సును వెంటనే వెనక్కి తీసుకువెళ్ళి ఆపేస్తాడు. ఆ తర్వాత బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్ చూడమని చెబుతాడు. బస్సు నిలిపివేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం కూడా అవుతుంది. దాంతో ప్రజలందరూ గోల చేస్తారు. ట్రాఫిక్ పోలీస్ లు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తారు. సూపర్ ఓవర్ నడుస్తుంది అంటు మహి సమాధానం ఇస్తాడు. ట్రాఫిక్ పోలీస్ ఓకే తలైవా అంటే అక్కడి నుంచి వెళ్లి పోతాడు. ఈ ప్రోమో సరి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కన్జ్యూమర్ ఫోరమ్స్ కు ఫిర్యాదులు సైతం నమోదయ్యాయి. నిర్లక్ష్యంగా బస్సును ఆపినా ప్రోమోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl