క్రికెట్ ప్రపంచంలో ఎందరో ప్రతిభావంతులైన వారు తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక రోజు క్రికెట్ నుండి రిటైర్ అయ్యే పరిస్థితి తప్పక వస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక క్రికెటర్ నిన్న తన అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి క్రీడాలోకాన్ని షాక్ కు గురి చేశాడు. అతను మరెవరో కాదు వెస్ట్ ఇండీస్ ట్రినిడాడ్ కు చెందిన కీరన్ పోలార్డ్. ఇతను కుడి చేతి బ్యాటింగ్ మరియు కుడిచేతి మీడియం పేస్ వేయగలడు. ఇతను 12 మే 1987 వ సంవత్సరంలో జన్మించాడు. ఇతను వెస్ట్ ఇండీస్ జట్టుకు వన్ డే కెప్టెన్ గా తన సేవలను అందించాడు.

అంతే కాకుండా కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రినిడాడ్ నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఇతను ప్రపంచానికి తెలిసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడినప్పుడే అని చెప్పాలి. ఇతను 2010 లో ముంబై ఇండియన్స్ తరపున ఒప్పనడం కుదుర్చుకున్నాడు. అప్పటి నుండి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 15 వరకు ముంబై తోనే తన ప్రస్థానం సాగింది. ముంబై అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన దానిలో పోలార్డ్ కీలక పాత్ర పోషించాడు. ఒక మ్యాచ్ ఫినిషర్ గా, బౌలర్ గా మరియు అద్బుతమయిన ఫీల్డర్ గా జట్టుకు ఉపయోగపడ్డాడు. కానీ ఈ సీజన్ లో తన ఆట ఏమాత్రం బాగా లేదు. మునుపటిలా బ్యాట్ ను స్వేచ్ఛగా జులిపించలేకపోతున్నాడు.

బహుశా పోలార్డ్ క్రికెట్ నుండి రిటైర్ కావడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఈ నిర్ణయం గురించి తెలిసిన పోలార్డ్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. బహుశా పోలార్డ్ కు ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు అని క్రికెట్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: