దీనిని బట్టి చూస్తే ఫలితం ఈ రోజులోనే తేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లార్డ్స్ లో ఎవరు విజేతగా నిలవనున్నారు అనే విషయం ఇప్పుడు చర్చలో ఉంది. రెండు జట్లలోని బౌలర్లు విజృంభణ ముందుకి బ్యాట్స్మన్ నుండి ఎటువంటి సమాధానం ఉండడం లేదు. ఈ రోజు కేవలం రెండవ రోజు మాత్రమే అప్పుడే మ్యాచ్ కీలక దశకు చేరుకుంది. ఈ రోజులో ఇంకా 50 కి పైగా ఓవర్లు మిగిలి ఉండగా ఫలితం ఎలా ఉండనుంది అనేది తెలియాల్సి ఉంది.
అయితే క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం క్రీజులో వచ్చే కొత్త బ్యాట్స్మన్ కు నిప్పులు చెరిగే బంతులతో బౌలర్లు పరీక్ష పెడుతున్నారు. అయితే కనీసం కొన్ని బంతులు నిదానంగా చూసి ఆడితే తర్వాత ఆడడం ఈజీ అవుతుంది అని అంటున్నారు. ఇక న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలవన్నా ? లేదా మ్యాచ్ ను డ్రా గా ముగించుకోవాలన్నా కూడా అసాధారణమైన ఆటతీరును ప్రదర్శిస్తేనే అది సాధ్యం అవుతుంది. కాగా గొప్ప ఇన్నింగ్స్ ఆడగలిగే లాతమ్, విలియమ్సన్ లు ఇప్పటికే పెవిలియన్ చేరగా... ఇప్పుడు భారం అంతా కాన్ వే, గ్రాండ్ హోమ్ మరియు మిచెల్ ల మీదనే ఉంది. మరి కివీస్ పోరాడి గెలుస్తుందా లేదా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతుందా అన్నది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి