ఈ రోజు ఎడ్గబస్టన్ లో అయిదవ రోజు ఫలితం తేలిన అయిదవ టెస్ట్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ వికెట్ల తేడాతో ఇండియాను సునాయాసంగా ఓడించి సిరీస్ ను డ్రా చేసుకుంది. దీనితో టైటిల్ ను ఇద్దరు కెప్టెన్ లు పంచుకున్నారు. అయితే మ్యాచ్ జరిగిన విధానాన్ని చూస్తే ఇండియా గెలిచేలా కనిపించింది.. కానీ ఇంగ్లాండ్ సరైన సమయంలో చెలరేగి మ్యాచ్ ను ఇండియా నుండి లాక్కుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎందుకు ఇండియా ఓడింది ? ఓటమికి గల కారణాలు ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం.

నిర్లక్ష్యం: మ్యాచ్ లో అర్ధభాగం అంటే... ఇరు జట్లు తమ మొదటి ఇన్నింగ్స్ ను ఆడిన తరువాత చూస్తే ఇండియా చాలా బలంగా ఉంది. కానీ రెండవ ఇన్నింగ్స్ లో ఎందుకో ప్లేయర్స్ లో ఒక నిర్లక్ష్యం ఏర్పడినట్లు అనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లీడ్ ఉందని భావనో లేదా ఇంకేదో అర్ధం కాకపోయినా ప్లేయర్స్ అవుట్ అయిన విధానం మాత్రం అలాగే ఉంది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, కోహ్లీ, గిల్, విహారి లాంటి ఆటగాళ్లు పూర్తిగా తమ వికెట్ లను కాపాడుకోలేక ఇంగ్లాండ్ బౌలర్లకు ఇచ్చేశారు. ఇక 378 పరుగులను కాపాడుకోలేక దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

బౌలర్ల ఫెయిల్యూర్: ఈ మ్యాచ్ లో ఒక్క బుమ్రా తప్పించి మరే బౌలర్ కూడా ప్రమాదకరంగా కనిపించలేదు. ఎంతో ఈజీగా ఇండియా బౌలర్లను ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉతికి ఆరేశారు. వన్ డే లలో బ్యాటింగ్ లాగా ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ సాగింది. వికెట్లు తీయడం అటుంచి.. అసలు పరుగులు కూడా కంట్రోల్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఓటమికి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకపోవడం కూడా ఒక లోటు అని చెప్పాలి.

బ్యాటింగ్ వైఫల్యం: ఈ మ్యాచ్ స్టార్ట్ అవక ముందు నుండి మనము చెప్పుకున్నట్లే ఇండియా ఇంగ్లాండ్ కన్నా బలహీనంగా ఉంది. దానికి తగినట్లే కేవలం రిషబ్ పంత్ మరియు జడేజాలు మినహా మరెవ్వరూ ఆశించిన మేరకు రాణించలేదు. ఇక ప్రధాన ఆటగాళ్లుగా మనము చెప్పుకున్న కోహ్లీ, విహారి, అయ్యర్ లు అయితే దారుణంగా ఆడారు. పంత్ జడేజా లు రాణించకుంటే ఇన్నింగ్స్ ఓటమి చెందిన ఆశ్చర్య పడాల్సిన పని లేదు.

ఇలా ఈ రోజు ఇండియా ఓటమికి ప్రధానంగా ఈ మూడు కారణాలను చెప్పుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: