ఎందుకో గాని ఇటీవలే కాలంలో వరల్డ్ కప్ లకు ఆదిత్యం ఇస్తున్న జట్లకు అస్సలు కలిసి రావడం లేదు అని చెప్పాలి. మొన్నటికీ మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటిదే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో ఉన్న బౌన్సి పిచ్ లపై పూర్తి అవగాహన కలిగిన ఆస్ట్రేలియా జట్టు ఇక వరల్డ్ కప్ లో అదరగొడుతుందని.. మరోసారి ఛాంపియన్గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో గ్రూప్ దశ నుంచి టోర్ని నుంచి నిష్క్రమించింది.


 ఇలా వరల్డ్ కప్ కు ఆతిథ్యం వహించిన ఆస్ట్రేలియా జట్టుకు అస్సలు కలిసి రాలేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ లో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పాలి. ఈక్రమంలోనే ఏ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగానే మారిపోయింది. ఉత్కంఠ భరితంగా జరుగుతున్న ఈ ఫిఫా వరల్డ్ కప్ లో కూడా ఆతిథ్య ఖతార్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.


 మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ లో మాదిరిగానే.. ఇక ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ లో కూడా ఆతిథ్య ఖాతార్ జట్టు లీగ్ దశ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ దశలో ఈక్విడార్ తో జరిగిన మ్యాచ్ లో 2-0 తేడాతో ఖతార్ ఓడిపోయింది. ఇక సెగనల్ తో జరిగిన మ్యాచ్లో 3-1 తేడాతో పరాజయం పాలు అయింది. దీంతో రెండు ఓటమిలతో టోర్ని నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా అవతరించింది ఆతిథ్య ఖాతార్. అయితే 92 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం ఇలా నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: