క్రీడా ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఇటీవల ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఖతార్ వేదికగా ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి. చివరి నిమిషం వరకు ఎవరు విజయం సాధిస్తారో కూడా తెలియని విధంగా ఉత్కంఠతో పరీక్షకులందరినీ కూడా మునివేళ్లపై నిలబెడుతుంది ప్రతి మ్యాచ్. అదే సమయంలో ఇక ఎన్నో మ్యాచ్లలో ప్రేక్షకుల అంచనాలు కూడా తారుమారు అవుతున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఎందుకంటే ఇక ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న కొన్ని టీం లకు వరుసగా పరాజయాలు ఎదురవుతూ ఉండడం చూసి అటు ఫుట్బాల్ అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు. ఇక ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో ఇలాంటి ఒక సంచలనమే నమోదయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఛాంపియన్ అర్జెంటిన జట్టుపై సౌదీ అరేబియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో క్రీడా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది అని చెప్పాలి.


 అయితే అర్జెంటీనా లాంటి ఒక పటిష్టమైన జట్టుపై ఇక తమ జట్టు విజయం సాధించడంతో సౌదీ అరేబియా ప్రభుత్వం సైతం హర్షం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ విజయానికి గుర్తుగా  సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఏకంగా అర్జెంటినా పై సాధించిన విజయానికి ప్రశంసగా ఏకంగా సౌదీ అరేబియా రాజు కలలో కూడా ఊహించని సర్ప్రైజ్ ఆటగాళ్లకు ఇచ్చాడు. టీం లోని ప్రతి ఆటగాడికి ఖరీదైన రోల్స్ రాయిస్ ప్యాంటామ్ కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ . ఖతార్ నుండి తిరిగి రాగానే ప్రతి ఒక ఆటగాడికి ఇక ఈ బహుమతి అందజేయానున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ ఒక్క కారు ధర 10 కోట్ల వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: