గత కొంతకాలం నుంచి కొన్ని ద్వైపాక్షిక సిరీస్ లలొ టీం ఇండియా మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నప్పటికీ ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలలో మాత్రం టీమిండియా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు.  పేలవ ప్రదర్శనతో తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇలా భారత జట్టు వరుస పరాజయాలతో అభిమానులందరినీ కూడా నిరాశ పరుస్తున్న నేపథ్యంలో  ఇక బోర్డులో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.


 ఇకపోతే ఈ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా ఒక్కో కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రానున్న రోజుల్లో ఇక జట్టులో మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మను కూడా ఏదో ఒక ఫార్మాట్ కి మాత్రమే కెప్టెన్ గా కొనసాగించే అవకాశం  ఉంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది..


 అదే సమయంలో ఇక కోచింగ్ సిబ్బంది విషయంలో కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలుస్తుంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కోచ్ లు ఉంటే బాగుంటుందని ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ను తప్పించే పనిలో ఉందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక ఇలాంటి సంచలన నిర్ణయం వైపు గానే ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే టి20 ఫార్మాట్ కు కొత్త కోచ్ సహా కొత్త కెప్టెన్ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదంతా నిజమైతే మాత్రం కెప్టెన్ గా రోహిత్ శర్మ హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవులకు ఎసరుపడే  అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: