
అయితే ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక జట్టు భారీ స్కోరు చేయగా ఇక లక్ష చేదనకు దిగిన భారత జట్టు మాత్రం చేతులెత్తేసింది అని చెప్పాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోర్కె పరిమితం కావడంతో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్లు అయితే కనీస ప్రదర్శన చేయలేక చివరికి జట్టును కష్టాల్లోకి నెట్టారు. అయితే టి20 జట్టులో భారీ అంచనాలతో అరంగేట్రం చేసిన శుభమన్ గిల్ అయితే ఎక్కడ తన సత్తా చాటలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లో ఏడు పరుగులు రెండవ మ్యాచ్లో ఐదు పరుగులు మాత్రమే చేశాడు.
ఈ క్రమంలోనే యువ ఓపెనర్ శుభమన్ గెలు ప్రదర్శన పై మాజీ ఆటగాడు గిల్ చోప్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపిఎల్ తో పాటు కేవలం టెస్ట్ వన్డే ఫార్మాట్లో మాత్రమే అదరగొట్టిన గిల్ కు టి20 ఫార్మాట్ అంతగా సరిపోదు అంటూ ఆకాష్ చోప్రా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. రెండు టీ20 మ్యాచ్లలో కూడా సింగిల్ డిజిట్ స్కోరికే శుభమన్ గిల్ పరిమితం అయ్యాడు అంటూ విమర్శలు గుప్పించాడు. రానున్న రోజుల్లో టి20 జట్టులో అతని స్థానం సుస్థిరం కావాలి అంటే మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు.