టీమ్ ఇండియా కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బౌలర్లపై వీర విహారం చేసిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు మాత్రం తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతూ ఉండడం గమనార్హం. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక జట్టుకు కావాల్సిన రీతిలో మంచి ఆరంభాలు ఇస్తూ ఇక హాఫ్ సెంచరీలతో అదరగొడుతూ ఉన్నప్పటికీ ఇక హాఫ్ సెంచరీని సెంచరీగా మలచలంలో మాత్రం రోహిత్ శర్మ విఫలం అవుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడేమో అని అభిమానులు అందరూ కూడా ప్రతి మ్యాచ్లో ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నిరాశ తప్పడం లేదు అని చెప్పాలి. ఇకపోతే రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు సమయం  గడిచిపోతుంది. ఇలాంటి సమయంలో ఇక రోహిత్ శర్మ సెంచరీ చేయకపోవడంపై కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటకాళ్లు కూడా స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక గత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ సెంచరీ చేయలేకపోతూ ఉండడం పై ఇటీవలే మాజీ ఆటగాడు ఇర్ఫాన్ ఖాన్ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని ఇర్ఫాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ సెంచరీ కొట్టకపోవడం అనేది అతని ఫాంపై ఎలాంటి ప్రభావం చూపదు అంటూ తెలిపాడు. న్యూజిలాండ్ పై రెండవ వన్డే మ్యాచ్లో అతను అద్భుతమైన షాట్లు ఆడటం మనం చూసాం. సరైన సమయంలో అర్థసెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. స్వల్ప లక్ష్య చేదన  ఉన్నప్పుడు దాటిగా ఆడాలని అందరూ అనుకుంటారు. కానీ రోహిత్ పరిస్థితులను అర్థం చేసుకొని క్రీజులో కుదురుకున్న తర్వాత షాట్లు ఆడాడు. అతను మంచి ఫామ్ లోనే ఉన్నాడు అంటూ ఇర్ఫాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: