బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాగా.. అటు భారత జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియా తో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడపోతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ టెస్ట్ సిరీస్ పైన అందరి కన్ను ఉంది. ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక భారత తుది జట్టులో ఎవరు చోటు సంపాదించుకుంటారు అన్నదానిపై కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది అని చెప్పాలి.  ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఓపెనర్ మిడిల్ ఆర్డర్ స్థానాలకు చాలా ఆప్షన్ లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇక ఎవరిని అవకాశం వరిస్తుంది అన్నది అంచనా వేయలేని విధంగా మారిపోయింది.


 ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఇక తమ ప్లేయింగ్ ఎలవెన్ జట్టు వివరాలను అటు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఉన్నారు. దీంతో ఇక ఈ రివ్యూ కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ సైతం ఆస్ట్రేలియాతో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఇక భారత ఎలవెన్ జట్టును ప్రకటించాడు. ఈ క్రమంలోనే తాను ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు దినేష్ కార్తీక్.


 మూడు నాలుగు స్థానాలకు  పూజార, విరాట్ కోహ్లీలను జట్టులోకి తీసుకున్నాడు. ఇక ఐదవ స్థానంలో శుభమన్ గిల్ కు బదులుగా సూర్య కుమార్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నాడు. ఆరవ బ్యాట్స్మెన్ గా ఇషాన్ కిషన్ బదులు తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ వైపే మొగ్గు చూపాడు ఈ సీనియర్ క్రికెటర్. ఇక పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుందని భావించి ముగ్గురు స్పిన్నర్లను కూడా తుది జట్టులోకి తీసుకున్నాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లను తన తుదిజట్టులోకి తీసుకొని కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టేసాడు.


తొలి టెస్టుకు డీకే టీమ్‌ ఇదే..:

రోహిత్‌ శర్మ, పుజారా, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్‌, అశ్విన్‌,అక్షర్‌ పటేల్, షమి, సిరాజ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk.