ఇక ఇందులో మొదటి విధానంగా హాట్ స్టార్ లో ఎలా ఓటు చేయాలంటే.. ముందుగా హాట్ స్టార్ యాప్ లో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అందులో హాట్ స్టార్ లో ప్రసారమయ్యే కార్యక్రమాల లిస్ట్ కనబడుతుంది. అందులో బిగ్ బాస్ 4 ను సెలెక్ట్ చేసుకొని లేటెస్ట్ ఎపిసోడ్ ప్లే చేయగా అందులో కిందనే ఆకుపచ్చ రంగుతో ఓట్ అని రాసి ఉంటుంది. ఆ వోట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయగానే లాగిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ లాగిన్ పూర్తిగా మొబైల్ నెంబర్ లేదా వారు ఉపయోగించే ఫేస్బుక్ ఖాతా ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేసి చిన్న వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఈ వారంలో ఎవరైతే నామినేషన్ లో ఉన్నారో వారి ఫోటోలు కనబడుతాయి. ఇలా నామినేషన్ అయిన వారికి మొత్తం ఒక వ్యక్తి 10 ఓట్లను ఇవ్వొచ్చు. ఇలా పది ఓట్లు ఒక్కరికి వేయాలని ఏం లేదు, నీకు ఎవరికి ఎన్ని ఓట్లు ఇవ్వాలనిపిస్తే అలా చేయొచ్చు.
ఇక మరో ఆప్షన్ చూస్తే... ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వడం. ఇందుకోసం బిగ్ బాస్ టీం ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో నెంబర్ ని అలాట్ చేయడం జరిగింది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ కు ఒక మిస్సేడ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒక ఓటు వేయవచ్చు. ఇలా రోజుకు ఒక నెంబర్ నుండి గరిష్టంగా 50 వరకు ఓట్లను వేయవచ్చు. ఇలా బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ లను కాపాడడానికి వారి ఫాన్స్ ఈ ప్రక్రియను పాటించాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి