తెలుగు రాష్ట్రాలలో మా టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం అంటే సంవత్సరానికి లక్షల్లో కేవలం 20 మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం అని చెప్పాలి. బయట వినిపిస్తున్న ప్రకారం బిగ్ బాస్ లో ఇబ్బందికరమైన కంటెంట్ ఉన్నా లేకపోయినా... కొందరు కంటెస్టెంట్ ల లైఫ్ లు మారిపోయే అవకాశం లేకపోలేదు. ఎంత కష్టపడినా రాని గుర్తింపు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తే వస్తోంది అంటే.. అది చాలా మందికి మంచి జరిగే విషయం అని చెప్పాలి. అలా ఇప్పటికే అయిదు సీజన్ ల పాటుగా ఎందరినో సెలెబ్రిటీలుగా మార్చి వారి జీవితాలను ఆనందమయం చేసింది. మరి కొందరు తమకున్న నోటిదూల మరియు అత్యుత్సాహంతో వివాదాల పాలయ్యారు.

అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 జరుగుతోంది. కాగా మూడు వారాల తర్వాత ఇంట్లో కేవలం 18 మంది మాత్రమే మిగిలారు. అందులో ఈ వారం నామినేషన్ లో 10 మంది ఉన్నారు. కాగా ఇందులో ఒక కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ మాత్రం బిగ్ బాస్ హౌస్ కి ఏ లక్ష్యం పెట్టుకుని వచ్చాడు అన్నది తెలియడం లేదు. పూర్తిగా తన దృష్టిని ఆటపై పెట్టడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు. అర్జున్ కళ్యాణ్ మెంటల్ గా మరియు ఫీజికల్ గా స్ట్రాంగ్ అయినప్పటికి, ఎందుకో టాస్క్ లలో కానీ, ఇంటిలో చేసే పనులు మరియు ప్రవర్తనలో శ్రద్ద చూపలేకపోతున్నాడు.

ఇక ఈ వారం జరిగిన హోటల్ టాస్క్ లోనూ ఘోరంగా విఫలం అయ్యి మరోసారి వరెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపికై  జైలుకి వెళ్ళాడు. అయితే జరిగిన నాలుగు వారాల బిగ్ బాస్ లో రెండు వారాలు జైలుకి వెళ్లి అర్జున్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ను మరియు బిగ్ బాస్ ను నిరాశపరిచాడు. అయితే అర్జున్ కేవలం శ్రీ సత్య కారణంగానే జైలుకు వెళ్లాడని తెలుస్తోంది. టాస్క్ లో తన  దగ్గర ఉన్న డబ్బును ఎక్కువ భాగం శ్రీ సత్య కే ఇవ్వడం అంతా గమనించారు. ఇలా ఏకపక్షముగా తాను చేసినా చేయకపోయినా డబ్బులు ఇవ్వడంతో అటు ప్రేక్షకులకు ఇటు ఇంట్లో వారికి అర్జున్ చులకన అయిపోయాడు. సో... అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కి వచ్చింది కేవలం శ్రీ సత్య కోసమే అని తెలుస్తోంది. ఇకనైనా తేరుకోకపోతే ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: