తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నప్పటికీ స్టార్ మా లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ కు మంచి పాపులారిటీ ఉంది. ఈ సీరియల్ ప్రేక్షకధారణ పొంది బాగా సక్సెస్ అయింది. ఈ సీరియల్లో హీరోయిన్గా చేస్తున్న వసుంధర తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా సుపరిచితమే. ఈమె కృష్ణవేణి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించింది వసుంధర. ఈమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


వసుంధర అసలు పేరు రక్షా గౌడ.  ఈమె బెంగళూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి.  ఫిబ్రవరి 17వ తేదీన బెంగళూరులో  జన్మించింది. ఇక అక్కడే జైన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నది సక్సెస్ఫుల్గా మోడల్ కావాలని ఈమె ఎన్నో కలలు కన్న ఈ ముద్దుగుమ్మ మోడల్గానే తన కెరీర్ను మొదలుపెట్టింది. అలా రాధా రమణ అనే కన్నడ సీరియల్ లో  అవకాశం రావడంతో ఆ సీరియల్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అలా అక్కడే కన్నడలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది వసుంధర.


ఇక తర్వాత కృష్ణవేణి సీరియల్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టైటిల్ రోల్ పాత్రలో నటించింది.  తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుని ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా అందరిని తన వైపుకు తిప్పుకుంది. సోషల్ మీడియా కూడా పలు రకాలైన పోస్టులను షేర్ చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది రక్షా గౌడ. ఇమే ఫేవరెట్ హీరో కార్తికేయ. కార్తికేయతో నటించాలని  అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలియజేస్తోంది. ఇలా కన్నడ ఇండస్ట్రీ నుంచి తన కెరీయర్ ను మొదలుపెట్టి తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి రక్షా గౌడ్. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ విషయాలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: