టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ మరింత క్రేజ్ అందుకున్న నటి వనిత విజయ్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరచితమే.. ముఖ్యంగా ఇమే వివాహాల విషయంలో ఎఫైర్ల విషయంలో కూడా నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో వనిత విజయ్ కుమార్ చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దేవి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్ ఈమె తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీలో నటీనటులుగా మంచి పాపులారిటీ అందుకున్నారు.


వనిత విజయ్ కుమార్ తన తండ్రి గురించి మాట్లాడుతూ.. తన తండ్రి తన తల్లి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా రాలేదని కేవలం రెండవ భార్యగా తన తల్లికి విజయ్ కుమార్ అసలు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా తెలియజేసింది. తన తల్లి చనిపోయిన తర్వాత తన పిల్లలకు రావలసిన ఆస్తిని కూడా ఇవ్వకుండా మోసం చేశారని వనిత విజయ్ కుమార్ తెలియజేస్తోంది. తన తండ్రి కూతురు పేర్లు చెప్పడంలో తన పేరు అసలు చెప్పేవారు కాదని.. తన తండ్రి వల్లే తన జీవితం నాశనం అయిపోయిందని తెలిపింది..



తాను తన పేరు చివరన భర్త పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేకపోయానని నాన్న మీద ఉన్న ప్రేమతో తన తండ్రి పేరు పెట్టుకున్న ఏకైక బిడ్డగా పేరు సంపాదించాను.. చివరికి తన తండ్రి వల్లే తన జీవితం దిగజారిపోయిందని తన తండ్రి మాటలు వినడం వల్లే తన జీవితం పూర్తిగా మారిపోయిందని అందుకు కారణం తన తండ్రి అంటూ వనిత విజయ్ కుమార్ వెల్లడించింది. ఇటీవల వనిత విజయ్ కుమార్ తన మనవరాలు దియా పెళ్లికి కూడా ఆమెను ఆహ్వానించలేదు.


2000 సంవత్సరంలో నటుడు ఆకాశ్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యింది.. ఆ తర్వాత ఏడాది విడాకులు తీసుకొని మరొక వ్యాపారవేత్త ఆనంద్ ని వివాహం చేసుకుంది. అతనితో కూడా ఎక్కువ రోజులు ఉండలేదు.. విడాకులు ఇచ్చి  ఆ తర్వాత పీటర్ పాల్ ను వివాహం చేసుకొని కొద్ది రోజులకే దూరం పెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: