తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరుపొందింది బిగ్ బాస్ షో. ఈ షో తెలుగు ,హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా ఇప్పటికి విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో తొమ్మిదవ సీజన్ త్వరలోనే మొదలు కాబోతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో ప్రారంభం కాబోతున్నట్లు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈసారి హౌస్ లోకి చాలా కొత్త కండిషన్స్ తో,సరికొత్త గేమ్స్ తో ఉండబోతున్నట్లు గడచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ప్రోమోలో చూపించారు. ఎప్పట్లాగే హోస్ట్గా నాగార్జున ఉన్నారు.


కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా హౌస్ లోకి ఒక క్రేజీ హీరోయిన్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హౌస్ లో ఎక్కువగా కన్నడ ముద్దుగుమ్మలే ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఈసారి కూడా కన్నడ హీరోయిన్ కావ్య శెట్టి కూడా అడుగుపెట్టబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈమె పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది. తెలుగులో గుర్తుందా శీతాకాలం చిత్రంలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది.


ఈ సినిమాలో తన గ్లామర్ లుక్స్ తో ,నటనతో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. అంతేకాకుండా నాగార్జునతో కలిసి కావ్య శెట్టి ఒక జ్యువెలర్  యాడ్ లో  నటించారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈమెకు భారీ క్రేజ్ పెరిగిపోయింది. అలా తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి గ్లామర్ ఫోటో షూట్ లు కూడా చేస్తూ ఉండేదట. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కావ్య శెట్టి హైలెట్ కాబోతోందనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఈ అమ్మడు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చాలామంది సెలబ్రిటీల పేర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్  పేర్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: