
దివి వాద్య ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన విషయాన్ని కూడా తెలిపింది.. ఒకప్పుడు తాను వైజాగ్ అబ్బాయితో ప్రేమలో ఉండేదాన్ని కొన్ని కారణాల చేత విడిపోయామని ఆ తర్వాత మళ్లీ ఎవరితో డేటింగ్ చేయలేదని తెలిపింది. కానీ తనకు ఎలాంటి అబ్బాయి ఇష్టం అనే విషయం మాత్రం అభిమానులతో పంచుకుంది.. తనని ఎంతో గారాబంగా చూసుకునేవారు కావాలని, తనతో ఫ్రెండ్లీగా ఉండాలని, తనని ఒక చిన్న పిల్లల చూసుకోవాలని.. ముఖ్యంగా తనని ఒళ్లో కూర్చోబెట్టుకొని మరి బుజ్జగిస్తూ ఉండాలని తెలిపింది దివి. ఈ క్వాలిటీస్ ఉంటే కచ్చితంగా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. పెళ్లి గురించి ఆలోచన అయితే ఇప్పుడు లేదని రాబోయే రోజుల్లో ఆలోచిస్తానని తెలిపింది దివి.
2017లో మోడలింగ్ వైపుగా అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి చిన్న చిన్న పాత్రలలో ఎంట్రీ ఇచ్చిన దివి మహర్షి, గాడ్ ఫాదర్, పుష్ప 2 తదితర చిత్రాలలో నటించింది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయి దివి. ఈ మధ్య సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండీ గా మారుతున్న దివి హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ కూడా అలాంటి అవకాశాలు మాత్రం ఇప్పటివరకు అందుకోలేదు. మరి రాబోయే రోజుల్లో నైనా ఏవైనా చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి మరి.