ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్రపంచ‌దేశాల్లోనూ విల‌య‌తాండం చేస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తిచెంది.. ప్ర‌జ‌లను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. మ‌రియు వేల మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుంది. ఈ మ‌హ‌మ్మారికి మందు లేక‌పోవ‌డంతో.. అంద‌రూ నివార‌ణ‌పైనే ఫోక‌స్ చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు ఎక్క‌డిక‌క్క‌డ లాక్‌డౌన్ విధించాయి. ప్ర‌జ‌ల‌ను బ‌ట‌య‌కు రాకుండా కఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు.  దీంతో ఉద్యోగులతో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ చేయిస్తున్నాయి. 

 

వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ టచ్‌లో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అయితే, వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం ఎక్కువగా జూమ్ యాప్‌నే వాడుతున్నాయి. అయితే ఈ జూమ్ యాప్‌లో డియో కాన్ఫరెన్స్‌ అంత సురక్షితం కాదని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. జూమ్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఉద్యోగి సమాచారం, కంపెనీ ఉత్పత్తి, సాఫ్ట్‌‌వేర్‌ అప్లికేషన్లు, రహస్యాలు, ఇతర డేటాను చోరీ చేసే అవకాశం ఉందని తెలిపింది. మ‌రియు ఇక నుంచి ఈ యాప్ వాడొద్దని కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

 

మీరు మీ జూమ్ యాప్ యొక్క అకౌంటును తొలగించాలని చూస్తున్నట్లయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను ఫాలో అయితే స‌రిపోతుంది. ఇందుకు ముందుగా జూమ్. యూఎస్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. త‌ర్వాత‌ మీ యొక్క జూమ్ అకౌంటుతో లాగిన్ అయి, ఎడమవైపు ఎగువన ఉన్న 'మై అకౌంట్' అనే టాబ్ మీద క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి 'అడ్మిన్' టాబ్ కోసం వెత‌కండి అడ్మిన్ టాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్ డౌన్ మెనులో 'అకౌంట్ మేనేజ్‌మెంట్' మీద క్లిక్ చేయండి.

 

ఇప్పుడు 'అకౌంట్ ప్రొఫైల్' మీద క్లిక్ చేయండి. ఇది ఎడమ వైపున బేసిక్ ఇన్ఫర్మేషన్ పేజీని ఓపెన్ చేస్తుంది.  త‌ర్వాత‌ 'టెర్మినేట్ మై అకౌంట్' మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ జూమ్ అకౌంటును తొలగించడానికి కంఫర్మ్ మీద నొక్కితే స‌రిసోతుంది. దీంతో మీ జూమ్ అకౌంట్ తొల‌గ‌బ‌డుతుంది.

  


 

మరింత సమాచారం తెలుసుకోండి: