టెక్నాలజీ పరంగా డెల్ ల్యాప్ టాప్ లకు మంచి డిమాండ్ ఉంది..ఈజీగా వీటిని ఉపయోగించవచ్చు.. అందుకే ఎక్కువ మంది వీటిని కొంటారు. అయితే వీటి వల్ల భారీ ప్రమాదం ఉందని అంటున్నారు. సైబర్ నేరగాళ్లు వీటిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.అందుకే మీ దగ్గర డెల్‌ ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ ఉంటే ఒకసారి చెక్‌ చేసుకోండి అంటున్నారు టెక్‌ నిపుణులు. జీ న్యూస్ కథనం ప్రకారం.. డెల్‌ టెక్‌ టీమ్‌ తమ సిస్టమ్స్‌లో ఓ బగ్‌ను గుర్తించిందట. దాని వల్ల కంప్యూటర్‌లో యూజర్లు దాచుకున్న వ్యక్తిగత సమాచారం నేరగాళ్లకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.


ఈ బగ్‌ ద్వారా హ్యాకర్‌ నేరుగా సిస్టమ్స్‌లోని స్టోరేజీలోకి వెళ్లొచ్చట. డెల్‌ సిస్టమ్స్‌లో ఈ సమస్య ఉందని కొన్ని రోజుల క్రితం సైబర్‌ సెక్యూరిటీ వ్యవహారాలు చూసే సెంటినెల్‌ ల్యాబ్స్‌ బృందం బగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పింది.ఈ ల్యాబ్ టెక్నీషియన్లు తెలిపిన వివరాల ప్రకారం డేటా హ్యాక్‌, మొత్తంగా సిస్టమ్‌ హ్యాక్‌ జరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇది డెల్‌ సిస్టమ్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ వల్లనే వస్తోందని సమాచారం. దీని వల్ల ఆ సిస్టమ్‌ అడ్మిన్‌ యాక్సెస్‌ను హ్యాకర్‌ పొందగలుగుతారు..


గతేడాది డిసెంబరులో వీటి గురించి డెల్‌కు సెంటినెల్‌ చెప్పింది. దానిపై డెల్‌ ఓ అప్‌డేట్‌ కూడా రిలీజ్‌ చేసిందని సమాచారం. కాబట్టి ఇటీవల కాలంలో మీరు అప్‌డేట్‌ చేసుకోనివారు.. వెంటనే చేసుకోండి. గత కొన్నేళ్లలో దేశంలో రాన్‌సమ్‌ వేర్‌ అటాక్స్‌ ఎక్కువయ్యాయి. ఆసియా పసిఫక్‌ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ అటాక్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎండ్‌ పాయింట్‌ థ్రెట్‌రిపోర్టు ఇటీవల వెల్లడించింది. పోయిన ఏడాది డిసెంబరులో సోలార్‌ విండ్స్‌ అనే సంస్థ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఓ బగ్‌ను కనిపిపెట్టింది.. ఇప్పటికీ ఆ సమస్య తగ్గలేదని తెలుసుకుంది. అందుకే విలువైన సమాచారాన్ని సిస్టమ్ లో పెట్టడం సేఫ్ కాదని గమనించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: