
ఈ ప్రయోగం పూర్తయితే మాత్రం స్టార్ షిప్ ద్వారా ప్రపంచం ఓ కొత్త ప్రయాణ మార్గంగా ప్రయాణం మొదలుపెడుతుంది. కొత్తగా ప్రపంచం మొత్తం అరగంట లేదా గంటలో చుట్టేసే ప్రయాణాలు మొదలవుతాయి. చంద్రుడు, మార్స్‌పైకి దీంతో పాటు లండన్ నుంచి న్యూయార్క్ ప్రయాణం కేవలం అరగంటలో పూర్తవుతుందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది సాధ్యం కానున్నట్టు తెలుస్తోంది. అమెరికా స్పేస్-ఎక్స్ రూపొందిస్తున్న భారీ షిప్-20 రాకెట్ ప్రయోగం విజయవంతం అయితే మాత్రం పైన చెప్పుకున్న ప్రయాణాలు సాధ్యం అవుతాయి.
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దేశాల మధ్య ప్రయాణం విమానాల్లో కాకుండా దేశీయ రాకెట్లతో జరగనుంది. భారత్ నుంచి అమెరికా వెళ్లాలంటే కనీసం 16 గంటలు ప్రయాణం అవుతుంది. కానీ, స్పేస్-ఎక్స్ తరహా రాకెట్ల ద్వారా ఆ ప్రయాణం సమయం చాలా త్వరగా జరుగుతుంది. కూర్చేని రిలాక్స్ అయ్యేలోగా జర్నీ కంప్లీట్ అవుతుంది. ఇదే జరిగితే విమానయానానికి ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా కుదేలయిన ఏయిర్ లైన్స్ రాకెట్లు పోటిపడనున్నట్టు కనిపిస్తోంది. పైగా ఈ తరహా రాకెట్లలో వందమందికి పైగా ప్రయణం చేసేందుకు వీలవుతుంది. అయితే, ఇన్నాళ్లు లేని ఈ ప్లాన్‌ను ఎలన్ మస్క్ బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే ప్రయాణ రంగం అడ్బాన్సుడ్ టెక్నాలజీ సంతరించుకుంటుంది.