
టైటానిక్ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రేమికులు. ఇక అలాగే టైటానిక్ అనే పేరుతో విడుదలైన సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే టైటానిక్ ప్రమాదం మాత్రం అందరికి కన్నీటి గాథను మిగిల్చింది. 1912 వ సంవత్సరం లో నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో రాత్రి సమయంలో 11:40 లకు సముద్ర గర్భంలో మునిగిపోయింది. అయితే ఇప్పుడు టైటానిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

1).RMS టైటానిక్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. ఈ షిప్ యొక్క ఎత్తు 882 అడుగులు, షిప్ యొక్క వెడల్పు 92 అడుగులు, ఇక బరువు విషయానికొస్తే..46,320 టన్నుల బరువు కలదు.
2). ఇంత సామర్థ్యం గల షిప్ కు ఏకంగా తొమ్మిది అంతస్తులు ఎత్తు వరకు గదులు ఉన్నాయి. వాటిని ప్రయాణికుల కోసం క్లాసులు (1 st,2nd) వారిగా విభజించారు.
3). ఇక ఇందులో లేటెస్ట్ జిమ్ స్పెషలిస్ట్ లు కూడా కలరు. ఇందులో ఒక రెస్టారెంట్ కూడా ఉండేది, దానిని ఒక ఇటాలిక్ చెఫ్ రన్ చేసేవాడట.

4). ప్రపంచంలోకెల్లా అత్యధిక పరిమాణం కలిగిన షిప్ ను ప్రతిరోజు నడపడానికి 800 టన్నుల బొగ్గును ఖర్చు చేసేవారట. ఇది గంటకు 27 కిలోమీటర్ల వరకు వెళుతుంది.
5). ఇందులో టెలిఫోన్ సదుపాయం కూడా ఉండడంతోపాటు, దీనికి ఒక ప్రత్యేకమైన సొంత పేపర్ ప్రింట్ "అట్లాంటిక్ డైలీ బులిటెన్ "కూడా ఉండేదట.
6). ఇందులో మనుషులు 3200 మంది ఉండగలరు. వీరి కోసం 14,500 ట్యాంకుల నీటిని ప్రతిరోజు అందించే వారట.




"మానవులు చేత సృష్టించబడిన ఒక అద్భుతం, తిరిగి మానవుడు చేసిన చిన్న తప్పిదం వల్ల నాశనం అయ్యింది".