అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం పుష్ప గురించి అందరికి తెలిసిందె.. పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలుసు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ లో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా.. అతని ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపించింది. ఇందులో బన్నీ మేకోవర్ యాటీట్యూడ్‏కు ప్రేక్షకులే కాదు… సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు.


సినిమా లోని పుష్పరాజ్ సిగ్నెచర్ స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిన విషయమే. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సైతం సోషల్ మీడియాను షేక్ చేశాయి. భాషతో సంబంధం లేకుండా మిలియన్ వ్యూస్‍తో దూసుకుపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పుష్ప పాటలకు స్టెప్పులేశారు. ఇటీవలే ఓ చిన్నారి సామి సామి పాటకు అద్బుతంగా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాతీ లోని కొందరు యువకులు సామి సామి పాటకు గర్బా స్టెప్పులేసి అదుర్స్ అనిపించారు. దసరా సందర్భంగా గుజరాతీలో నవరాత్రి ఉత్సవాల్లో గర్బా చేస్తుంటారు..


ఇటీవల కొందరు యువకులు సామి సామి పాటకు గర్బా డాన్స్ చేస్తూ.. హుక్ స్టెప్ వేస్తూ అదుర్స్ అనిపించుకున్నారు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఇది చూసిన రష్మిక.. క్రేజీ అంటూ ఎమోజీలను జత చేసింది. ఇక ఇటీవల రష్మిక సైతం గుడ్ బై ప్రమోషన్లలో భాగంగా మామ్స్ 3 ప్రోగ్రామ్‏లో పాల్గొన్న రష్మిక బాలీవుడ్ నటుడు గోవిందాతో కలిసి సామి సామి పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉంది.. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: