నీరు, జలం, ప్రాణధారం ఈ నానార్థాలన్నీ రెండు మూలకాలు కలిగిన హైడ్రోజన్, ఒక మూలకం కలిగిన ఆక్సీజన్ కి చెందినది.అదేనండీ నీరు (H2O).సందర్భాన్ని బట్టి నీటిని రకరకలుగా పిలుస్తాం.ఎక్కువ భూభాగాన్ని నీరు ఆక్రమిస్తే దానిని సముద్రం అని, చిన్న భూభాగాన్ని ఆక్రమిస్తే చెరువు అని అంటాము. నీటిని చూడటం కోసం పర్యాటకులు వస్తు వుంటారు అవి బీచ్ లు కావచ్చు,పెద్ద పెద్ద కొండల పై నుండి వయ్యారంగా జాలువారే  జలపాతాలు కావచ్చు మరియు సరస్సులు కావచ్చు, అయితే అప్పుడప్పుడు నీటికీ కోపం కూడా వస్తుంది. కోపం వస్తే సునామీ గా మారి ఎంతో మంది ప్రాణాలను తీసుకుపోతుంది. అలాగే సునామికి చెల్లెలు అయిన వరదలు ఇవి కూడా వచ్చి పెద్ద ప్రాణ నష్టాన్ని తెచ్చిపెడతాయి.
అయితే భూమి అనే గ్రహం పైకి నీరు ఎలా వచ్చింది? నీరు లేనిదే జీవం లేదు, నీరు లేనిదే ఈ ప్రకృతే లేదు.అటువంటి నీరు భూగ్రహం పైకి ఎలా వచ్చింది? ఏదైనా ఉద్భవించాలంటే పుట్టక అనేది ఉండాలి కదా అదే విధంగా నీటి పుట్టక మరియు అది భూగ్రహం పైకి ఎలా వచ్చింది అనే విషయాలు ఇందులో తెలుసుకుందాం.  

నీటి వలన భూమి పై సమస్త ప్రాణులు బతుకుతున్నాయి.అయితే శాస్రవేత్తల అంచనా ప్రకారం, కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఎక్కడి నుంచో ఈ నీరు అనే పదార్థం భూమి మీదకు వచ్చి చేరింది . అప్పుడే ఈ సముద్రాలన్నీ పుట్టుకొచ్చాయి అని శాస్రవేత్తల అంచనా వేస్తున్నారు. సౌర వ్యవస్థ అంచున వున్నటువంటి గ్రహ శకలలు మరియు తోక చుక్కల నుండి నీరు అనేది వచ్చి ఉంటుందని నమ్ముతున్నారు. అంతే తప్పించి నీరు రావడానికి సరైన కారణాలు ఇప్పటికి కనుగొనబడలేదు.

నీరు గురుత్వాకర్షణ శక్తికి విరుద్దంగా పనిచేయగలదు. ఇందువల్లే మన శరీరం లో మెదడు కి నీరు కింది నుండి పైకి సరఫరా అవుతుంది. నీటికి వాసను ఉండదు. కానీ ఎందులో పోస్తే అందులో సులభంగా ఒదిగిపోతుంది. నీటికి ఈ లక్షణం ఉండడం వలన భూమి మీద జీవం అనేది ఉద్భవించింది. అయితే కొందరు దేశాల శాస్రవేత్తలు ఉపగ్రహాల ద్వారా జరిపిన ప్రయోగాల మూలంగా  నీటి యొక్క ఆనవాళ్ళు మన గ్రహం పైనే కాకుండా అంగారకుడు ,ప్లూటొ మరియు చంద్రుడి పై కూడా ఉన్నట్లు  గుర్తించారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: