ఆడవాళ్లు చాలా సౌమ్యంగా ఉంటారు.. శారీరకంగా కష్టంగా ఉండే పనులు వారి చేయలేరు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఈ అభిప్రాయం పూర్తిగా తప్పని నిరూపిస్తూ, అన్ని రంగాల్లోనూ తక్కువ కాదని జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు నేటి తరం మగువలు.ఇక ఈ కోవకే చెందిన వారే మహారాష్ట్ర మహిళా రైల్వే ఉద్యోగులు. ఇక గూడ్స్ రైళ్లల్లో అండర్ గేర్ టెస్ట్ , అలాగే ఎయిర్ బ్రేక్ టెస్టింగ్ లాంటి కఠినమైన పనులను వారు సులువుగా చేస్తూ మహిళలకు వున్న శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు. ఈ టీం విధులు నిర్వహిస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.


ఇక తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ 'నారీ శక్తి' పేరుతో ఈ వివరాలను ట్వీట్ చేయడం జరిగింది. మహారాష్ట్ర గూడ్స్ యార్డ్ లో మహిళా రైల్వే టీం అండర్ గేర్ ఎగ్జామినేషన్, ఎయిర్ బ్రేక్ టెస్టింగ్, అండర్ ఫ్రేమ్స్, సైడ్ ప్యానెల్స్ ఇంకా గూడ్స్ రైళ్లకు సంబంధించిన వివిధ పనుల చేస్తూ తామేంటో నిరూపించడం జరిగింది. ఇక ఈ పనుల కోసమే ఈ టీమ్ ని నియమించారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతోంది. కొంత మంది రైల్వే మహిళా ఉద్యోగులు వివిధ రకాల పనులు చేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోంది.


ఇక కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతూ మహిళల గొప్పతనాన్ని చాటి చెబుతుంది. ఇక ఈ వీడియోను ట్విట్టర్‌లో 65 వేల మంది చూశారు. దాదాపు 8 వేల మందికి పైగా ఈ వీడియోని లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను చూసినవారు శభాష్ మహిళలు దేంట్లో తక్కువ కారని మీరు నిరూపించారు అని తమ కామెంట్లతో విశేషంగా స్పందిస్తున్నారు.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.



https://twitter.com/PiyushGoyal/status/1402989192632672259?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: