
ఇక కొంతమంది కాస్త ధైర్యం చేసి అసలు ఏం జరిగి ఉంటుంది గుహ లో ఏముంది అని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడ గ్రామస్తులకు ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది. కొన్ని రోజుల నుంచి పొలాలకు సమీపంలో ఉన్న ఒక గుహ నుంచి వింత శబ్దాలు రావడం మొదలైంది. ఇక మొదట గ్రామస్తులు పట్టించుకోకపోయినా ఆ తర్వాత మాత్రం అందులో ఏమై ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది గ్రామస్తులు కలిసి గుహలో ఏముందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఆ గుహలో ఏకంగా పది అడుగులకు మించి ఒక కొండచిలువ కనిపించింది.
ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేట లో ఒక గుహలో పదుల సంఖ్యలో 10 అడుగులకు పైగా కొండచిలువలు గ్రామస్తులను భయపెట్టాయ్. గ్రామానికి పక్కనే ఉన్న ఒక కొండ కింద ఒక గుహ ఉంది. ఇక అందులో కొండచిలువలు నక్కి ఉన్నాయి. ఇటీవలే అక్కడి నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గ్రామస్తులు అందరూ అక్కడికి వెళ్లి పరిశీలించగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పది అడుగుల పైగా ఉన్న కొండచిలువ లను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కొండచిలువ లను పట్టుకుని అడవిలో వదిలేయడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.