మనిషి భయపడే జంతువుల్లో సింహం ఒకటి. దగ్గర నుంచి చూస్తే కచ్చితంగా వణికిపోతారు. సింహాన్ని దూరం నుంచి చూస్తేనే కొంచెం భయం వేస్తుంది. ఇక సింహం గాండ్రింపుకు వణికిపోవాల్సిందే. సింహం వేటాడింది అంటే ఇక అంతే..సింగిల్‌గా ఉన్నా దాని రాజసం, ఠీవినే వేరు. సోషల్ మీడియాలో సింహాలు వేటాడే వీడియోలు ఎన్నో వచ్చాయి. అంతేకాదు ఆ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సింహం చేస్తున్న పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది చూసిన వారందరు మేము చూస్తున్నది నిజమేనా అని షాక్ అవుతున్నారు. అస్సలు నమ్మలేకపొతున్నారు. మరి ఆ సింహం ఏం చేసింది..అందరు ఎందుకు ఇంతలా షాక్ అవుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు విషయం ఏంటంటే..ఒక సింహం వేటాడి జంతువులను తినడం చూసిన మనకి ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం చూస్తున్నది నిజమేనా అని రీప్లే చేస్తుంటాం. ఒక సింహం సాధువు జంతు మాదిరి ఆకులు తింటోంది. అవును మీరు విన్నది నిజమే. సింహం ఆకులు తింటున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటి సింహం ఆకులు తినడం ఏంటని అందరు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో ఉన్న సింహం పులిలానే కనిపిస్తుంది. కానీ  ఏదో సాధువు జంతువు మాదిరిగా ఆకులు అలమలు తింటోంది. ఈ వీడియో చూసిన వారందరు సింహం సడెన్ గా శాఖహారిగా మారిందంటూ కామెంట్లు పెడుతుండగా, కొందరు ఇది శ్రావణ మాసం కదా అందుకే ఆ సింహం ఆకులు తింటుందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుండగా, ఈ వీడియో చూసిన వారందరు షేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు.

ఇప్పుడున్న కాలంలో ఏది జరిగిన అది సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ముఖ్యంగా సింహాలు, పులులు, పాముల మీద ఏ చిన్న వీడియో వచ్చిన అది నెట్టింట హల్ చల్ చేయాల్సిందే. ఈ వీడియోలని పెద్దవారే కాదు పిల్లలు కూడా ఎక్కువగా చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి చూసిన వారందరు వారికి అనిపించింది కామెంట్ల రూపంలో పెడుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: