సాధారణంగా చేపలు ఎక్కడ బతుకుతాయి అంటే ప్రతి ఒక్కరు కూడా చేపలు నీళ్లలోనే బ్రతుకుతాయి అని బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు. నిజమే చేపలు నీళ్లలోనే బ్రతుకుతాయి. నీటిని విడిచి బయటికి వచ్చాయి అంటే చాలు చివరికి నిమిషాల వ్యవధిలోనే వాటి ప్రాణం పోతూ ఉంటుంది. కానీ చేపలు ఎడారిలో బ్రతకడం గురించి ఎప్పుడైనా విన్నారా.. ఏకంగా ఎడారిలో ఉండే ఇసుకలో చేపలు ఈదుకుంటూ ముందుకు వెళ్లడం ఎప్పుడైనా చూసారా.. ఊరుకోండి వాసు చేపలు ఏంటి? ఎడారిలో బతకడం ఏంటి?


 నీళ్లలో నుంచి బయటికి వస్తేనే చచ్చిపోతాయి. అలాంటిది నీటి చుక్క కూడా ఉండని ఎడారిలో చేపలు ఎలా బ్రతుకుతాయి అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఏకంగా ఎడారిలో బతుకుతున్న చేప గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒకరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. ఏకంగా ఇందుకు సంబంధించిన వీడియో కూడా ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. న్యుట్రాపికల్ ఆర్మార్ట్ క్యాట్ ఫిష్ అనే చేప దక్షిణ అమెరికాలోని మంచినీటి ఆవాసాలలో నివసిస్తూ ఉంటుంది. నీళ్లతో మాత్రమే కాదు భూమి పైకి వెళ్లి ప్రయాణం చేసే అద్భుతమైన సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.


 రిప్లైట్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన లోకోమోషన్ టెక్నిక్ ను ఇవి భూమిపై ప్రయాణించడానికి ఉపయోగిస్తూ ఉంటాయి. ఇక ఈ టెక్నిక్ లో భాగంగా పెక్టోరల్ రెక్కలను భూమిలోకి పెట్టి నెట్టడం.. వంపు వంటి చలనాన్ని సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఏకంగా ఈ చేప ఎడారిలో నీటిలో ఈదినట్లుగానే ఎడారి ఇసుకలో వెళ్తూ ఉన్న వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. కాగా ఈ ప్రత్యేకమైన చేపలు ఏకంగా ఎడారిలో కూడా బ్రతకగలవు అంటూ ఇక ఈ వీడియో తీస్తున్న వ్యక్తి చెప్పడం వినవచ్చు. ఏదేమైనా ఇలా ఎడారిలో బతికే చేప అంటే వినడానికి కాస్త వింతగా ఉంది కదా.https://twitter.com/gunsnrosesgirl3/status/1738129515354714608?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1738129515354714608%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

మరింత సమాచారం తెలుసుకోండి: