అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణంలో ఓ భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక్కడ, ఒకాయన బీడి వెలిగించే మండుతున్న అగ్గిపుల్లను ఒక దగ్గర విసిరేశాడు. ఈ చిన్న తప్పు కారణంగా ఎన్నో దుకాణాలు కాలిపోయేంత పెద్ద అగ్నిప్రమాదానికి దారితీసింది.అసలు ఏం జరిగిందంటే, ఆయన బండి పై నుంచి కింద పడిన పెట్రోల్ మీద మంట మండుతున్న అగ్గిపుల్ల వేశాడు. ముందే 5 లీటర్ల పెట్రోల్ పోయిందని సంగతి ఆయనకు తెలియదు. అందుకే దానిపై అగ్గిపుల్ల విసిరేసాడు. ఉదయం 11:30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో చాలా నష్టం జరిగింది. అయితే, స్థానికులు వెంటనే స్పందించి మంటను అదుపు చేయడంతో పరిస్థితి మరింత తీవ్రతరం కాలేదు. ఆగిపోయింది.

ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ నుంచి ఐదు లీటర్ల పెట్రోల్ తీసుకుని వెళ్తుండగా, కంటైనర్ లీక్ అయింది. రోడ్డు మీద పెట్రోల్ స్పిల్ అయ్యింది. కొన్ని దుకాణాలు, వాహనాల దగ్గరే పెట్రోల్ మొత్తం పడిపోయింది. సీసీ కెమెరా ఫుటేజ్‌లో, ఇద్దరు మనుషులు అక్కడే మాట్లాడుకుంటుండగా, ఒకరు బీడి వెలిగించి, ఆ అగ్గిపుల్లను అజాగ్రత్తగా పెట్రోల్ పడిన చోట వేశారు. అంతే కొన్ని మిల్లిసెకన్లలోనే పెట్రోల్‌కు మంటలు అంటుకున్నాయి. ఒకసారిగా మంట చాలా ఎత్తుకు ఉవ్వెత్తున ఎగిసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు.

దుకాణాలు, వాహనాలకు నష్టం

అగ్నిప్రమాదంలో అక్కడ పార్క్ చేసిన కొన్ని వాహనాలు, దుకాణాలు దగ్దం అయ్యాయి. అయితే, స్థానికులు తెలివిగా వ్యవహరించి, దగ్గర్లో ఉన్న పెట్రోల్ పంపుకు మంట అంటుకోకుండా అడ్డుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇంతకు ముందూ ప్రమాదాలు జరిగాయి

సిగరెట్, బీడీలు అగ్గిపుల్లలు అజాగ్రత్తగా పడేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఇద మే నెలలో లోల్‌కతాలో 28 ఏళ్ల ఒక వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకుని నిద్రపోయాడు అయితే ఆ సిగరెట్ మంట పెద్ద మంటకు దారి అతడిని జీవ దహనం చేసింది. ఏపీలో జరిగిన రీసెంట్ సంఘటనకు సంబంధించిన వీడియోను చూసేందుకు  https://x.com/sudhakarudumula/status/1826174520019005592?t=IJt24lfr1kdW9WnQRqEI7Q&s=19 లింకు పైకి క్లిక్ చేయవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: