ఫైనల్లీ ..భారత్ - పాకిస్తాన్ ల మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పడింది . అది ఫుల్ స్టాప్ అని చెప్పలేం ప్రెసెంట్ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది . ఇరు దేశాలు దేశ ప్రజల క్షేమం కోసం కాల్పుల విరమణ ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు జరిగిన వార్ కి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే కాశ్మీర్లో పెహల్గాం లో టెరరిస్ట్ ఎటాక్ పై భారత్  ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు అనే విషయం .

దానికి ప్రతికారంగానే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రస్ధావరాలన్నిటిని మట్టుపెట్టేసింది ఇండియన్ ఆర్మీ . దీంతో పాకిస్తాన్ కూడా భారత్ పై రివర్స్ అటాక్ ప్రారంభించింది.  పాకిస్తాన్ డ్రోన్లు ..మిస్సైలు భారత్ సరిహద్దు రాష్ట్రాలపై దాడికి ప్రయత్నించింది . ఈ దాడిని గుర్తించిన భారత్ ఆర్మీ ధీటు గా పాకిస్తాన్ కి జవాబు చెప్పింది . గాల్లోనే పాకిస్తాన్ డ్రోన్లను మిస్సైల ను పేల్చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ లను మిస్సైల ను సరిహద్దుల్లోనే కూల్చేసింది. కాగా పాకిస్తాన్లోని లాహోర్ - కరాచీ - ఇస్లామాబాద్ సహా పలు నగరాలపై భారత్ ఆర్మీ దాడి చేసింది . దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతున్నాయి .

కాగా కూలిపోయిన పాక్ ఎయిర్ఫోర్స్ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గాల్లో లేపుకొస్తున్న ఫోటో ఒకటి నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటో పై భారత్ ప్రజలు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . భారత్ ఆర్మీ పేల్చేసిన పాక్ ఎయిర్ ఫోర్స్ విమానం జమ్ము కాశ్మీర్ పొలాల్లో పడిపోయింది . దీన్ని భారత ఐఏఎఫ్ విమానం తీసుకొస్తూ ఉండగా పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీనిపై నెటిజన్లు స్పందిస్తూ "ఆ పాక్ నా కొడుకులకు ఇప్పటికైనా ఇండియన్ సత్తా ఏంటో అర్థం అయి ఉంటుంది ..భారత ఆర్మీతో పెట్టుకుంటే ఇప్పుడు విమానం మాత్రమే లేపుకొస్తున్నారు ..రేపటి రోజు పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదుల తలను అలాగే హెలికాప్టర్ కి వేలాడదీసి తీసుకొస్తారు" అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ ఒక్క ఫోటో 140 కోట్ల మంది ఇండియన్ ప్రజలకు తెలియని కిక్ ఇస్తుంది అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: