విమాన ప్రయాణాలంటేనే హై రిస్క్, హై అలర్ట్. అయితే ఇటీవలి కాలంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాలు సాంకేతిక కారణాలతో ఆగిపోవడం, ప్రమాదాలకు గురవ్వడం తరచూ జరుగుతోంది. అలాంటి మరో ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టేకాఫ్‌కు సిద్ధమైన విమానం ఒక్కసారిగా మంటల్లో కూరుకుపోయింది. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది కానీ... ఆ క్షణాలు మాత్రం మరిచిపోలేనివే. ఘటన పూర్తి వివరణ: డెన్వర్ విమానాశ్రయం నుంచి మయామికి వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ల్యాండింగ్ గేర్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఒక్కసారిగా విమానం నుంచి మంటలు చెలరేగడంతో, టేకాఫ్ ప్రక్రియను మధ్యలోనే నిలిపేశారు. విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో గజగజల‌రు..!


ఆ సమయంలో ఎమర్జెన్సీ గాలితో నిండిన స్లయిడ్‌ లను (slides) వినియోగించి ప్రయాణికులను తక్షణమే కిందకు దించారు. ఒక్కొక్కరుగా స్లయిడ్‌పై నుంచి కిందకు జారుతూ పరుగులు తీస్తూ రన్ వేపై బయటపడిపోయారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రయాణికుల ఉలిక్కిపాటు, పరుగులు.. ఒక్కో ఫ్రేమ్‌ భయానక రియాలిటీని చూపిస్తోంది. ఎఫ్.ఏ.ఏ ప్రకటన: ఈ ఘటనపై స్పందించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)... ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగానే విమానం టేకాఫ్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. మంటలు అదుపులోకి వచ్చాక, విమానాన్ని పూర్తిగా తనిఖీ చేస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధులు ప్రకటించారు.



ప్రయాణికులకు స్వల్ప గాయాలు: విమానంలో మొత్తం 173 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎమర్జెన్సీ స్లయిడ్ ద్వారా కిందకు దిగుతున్న సమయంలో కొందరు జారిపడి గాయపడ్డారు. వారి గాయాలు పెద్దగా లేవు. ప్రథమ చికిత్స అనంతరం వారిని భద్రంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం అనంతరం బోయింగ్ విమాన భద్రతపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. ప్రమాదం తప్పింది కానీ ప్రశ్నలు మిగిలాయి: ఇదే ఏదైనా టేకాఫ్ అనంతర దశలో జరిగితే..? వాయువీలో ఉన్నపుడు ఈ సమస్య తలెత్తితే..? ఇవే ఇప్పుడు ప్రయాణికుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ల్యాండింగ్ గేర్ సమస్యలు గలిగే ఘటనలు తరచూ జరుగుతుండటంతో.. బోయింగ్ విమానాలపై తిరిగి భద్రతా ఆడిట్‌కి అవకాశం ఉందని విమానయాన రంగ వర్గాలు భావిస్తున్నాయి. డెన్వర్ ఘటనలో తీసుకున్న తక్షణ చర్యలతో ఓ భారీ ప్రమాదం తప్పినట్లు అంటున్నారు అధికారులు. కానీ ఇదంతా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే.. సాంకేతిక తనిఖీలు మరింత కఠినంగా, ముందస్తుగా జరగాలి అనే డిమాండ్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: