
ఒక ప్రముఖ టీవీ చానల్ సీఈఓ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ – “వేణు స్వామి అడ్డంగా దొరికిపోయాడు” అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లలో వేణు స్వామి ఉదంతంపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. కామాఖ్య దేవి ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు చేయించడానికి ఆయన వెళ్లినట్లు సమాచారం. అయితే 10 మంది భక్తులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించిన వేణు స్వామిని అక్కడి పూజారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పూజారి వరుసగా హిందీ, ఇంగ్లీష్‌లో ప్రశ్నలు అడుగుతుండగా, వేణు స్వామి సమాధానం ఇవ్వలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ జంట విడాకులు తీసుకుంటారని పేర్లతో సహా చెప్పి సంచలనం సృష్టించిన వేణు స్వామి, ఆ తర్వాత చాలా మంది స్టార్ సెలబ్రిటీలకు ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబ్, టీవీ చానెల్స్‌లో వరుస ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ అయిన ఆయన, రాజకీయ విషయాలపై చేసిన వ్యాఖ్యల కారణంగా విమర్శలు ఎదుర్కొని కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్నాడు.
కానీ ఇప్పుడు అస్సాంలో జరిగిన ఈ ఘటనతో మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. “వేణు స్వామి నిజంగానే పూజారినా? లేక దొంగ బాబానా? ఆయనను ఎందుకు అక్కడి పూజారి నిలదీశాడు?” అనే ప్రశ్నలు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఊహాగానాలతోనే ఫేమస్ అయిన వేణు స్వామి, ఇప్పుడు ఊహాగానాల కారణంగానే ట్రోల్లింగ్ కి గురవుతున్నాడు. ఆలయ పూజారి ఎదుట నిస్సహాయంగా నోరువిప్పలేకపోవడం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది..???