దీపావళికి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా రకాల వంటలను ట్రై చేస్తుంటా. అలాంటి వారికోసం ఈ స్వీట్ ఈజీగా చేసుకొని అమ్మవారికి సమర్పించారు. పల్లీలు బర్ఫీ చేసుకోవడం ఎలాగో చూద్దాం..


పల్లీలు పచ్చివి ఉడకబెట్టిన కాస్త ఉప్పు వేసుకొని తింటే తిన్నకొద్ది ఇంకొన్ని తినాలని అన్పిస్తుంది.. భూమిలో దొరికే ఏవైనా సరే ఉడకబెట్టిన తిన్నా , కాల్చుకొని తిన్నకూడ మరింత రుచిగా ఉంటాయి. ఈ పల్లీలు పులిహోర , స్నాక్స్ , స్వీట్స్ వంటి ఎంతో రుచికరమైన ఈ పల్లిలతో బర్ఫీ ని తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు..  

పల్లీలు : అరకిలో  
బెల్లం : అరకిలో   
కొబ్బరి: అరకిలో   
యాలకపొడి : రెండు స్పూన్లు 
డ్రై ఫ్రూట్ పొడి: ఒక కప్పు     


తయారీ విధానం: 

ముందుగా పల్లీలను బాగా వేయించి పొట్టు తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని రెండుగా వచ్చేలా చిదుముకోవాలి. కొబ్బరిని తురుము పట్టుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. స్టౌ ఆన్ చేసి ఒక గుంత బౌల్ పెట్టుకొని అందులో బెల్లం వేసి , బెల్లం మునుగు వరకు నీళ్ళు పోసి బాగా కాగనివ్వాలి.. లేత పాకం వచ్చేలా చేశాక..అందులో ఈ కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరి కొద్దిగా ఉడికిన తర్వాత పాకం దగ్గర పడుతున్నప్పుడు ఈ పల్లిలను వేసుకోవాలి ఆ తర్వాత యాలకల పొడి , డ్రై ఫ్రూట్ పోడి వేసుకొని బాగా కలపాలి..ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారాక కట్ చేసుకోవాలి..అంతే అమ్మవారికి ఇష్టమైన ఎంతో రుచికరమైన పల్లీ బర్ఫీ రెడీ.. మీరు ట్రై చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి..




మరింత సమాచారం తెలుసుకోండి: