ప్రతి మహిళల బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అయితే మహిళల గర్భం ధరించిన సమయం నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయితే గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు బీట్ రూట్ ని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం పొందిన తర్వాత ప్రతి గర్భిణీ స్త్రీకి ఐరన్ తప్పనిసరిగా అవసరమవుతుంది. గర్భధారణ సమయంలో చాలా అవసరం. రక్తంలో హీమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. గర్భిణీలు దీన్ని తినడం వల్ల రక్తంలో ఐరన్ కౌంట్ పెరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల అనీమియాకు గురికాకుండా ఉంటారు.

ఇక బీట్ రూట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది రక్తంలో ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. గర్భం పొందగోరువారు , గర్భధారణ కాలం మొత్తం దీన్ని తీసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తల్లికి మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డ హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా పుడుతుంది. అయితే దీన్ని తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి.

అయితే బీట్ రూట్ లో బీటాసి అనే న్యూట్రీషియన్ ఉంటుంది. ఇది రక్తం మరియు కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ తొలగిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లైతే, గర్భిణీ స్త్రీ బాడీ ఫిట్ గా రియు హెల్తీగా ఉంటుంది. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు, బీట్ రూట్ తినడం వల్ల బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

అంతేకాక గర్భం పొందిన తర్వాత గర్భిణీ పొట్టలు బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి, ఇందులో ఫోలిక్ యాసిడ్ గ్రేట్ గా సహాయపడుతుంది, బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది, ఇది బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు ఇది రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి సహాయపడుతుంది. ఈ న్యూట్రీషియన్ వెజిటేబుల్ బ్లడ్ ఫ్యూరిఫై చేసి శక్తి కలిగి ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపాలు లేకుండా రక్షణ కల్పిస్తుంది. బీట్ రూట్ ఫిజికల్ స్టామినా పెంచుతుంది. డెలివరీ సమయంలో సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్, విటమిన్ ఎ, బి, సోలబుల్ ఫైబర్ మరియు ఫ్రోటీన్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ పెజర్ తగ్గిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: