ప్రస్తుతం మార్కెట్లో చర్మ సౌందర్యానికి రకరకాల ప్రొడక్ట్ లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో జీవన విధానానికి తగ్గట్లుగా ఒక్కో రకమైన ప్రొడక్ట్ ను వాడుతూ ఉంటారు ప్రజలు.. అయితే ఈ రకమైన ప్రొడక్ట్స్ లో ఎంతో ప్రాచుర్యం పొందింది ఫెయిర్ అండ్ లవ్లీ.. ధనిక, పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ వాడడానికి ఇష్టపడ్డారు.. ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు కూడా.. మరి ఇంతటి ప్రాచుర్యం పొందిన ఫేర్ అండ్ లవ్లీ పేరుని ఈ మధ్యనే మార్చారు .. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ కారణం చేత ఈ పేరును మార్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు చూద్దాం..

ఓ 22 ఏళ్ల ఓ అమ్మాయి అలుపెరుగని కృషి వల్లే ఇది సాధ్యమైంది.. కోట్ల రూపాయల విలువ గల ఈ కంపెనీ పేరు ని కేవలం ఒక టీనేజ్ అమ్మాయి పేరును మార్చుకునేలా చేసింది అంటే చిన్న విషయం కాదు.. దీనికి ఒక పెద్ద కారణం ఉంది అదేమిటంటే.. నల్ల జాతీయులు, తెల్లజాతీయులు అనే ఈ రేసిజం ఎప్పటినుంచో ఈ ప్రపంచంలో పెను భూతంలా ఉంది.. తెల్లజాతీయులు గొప్ప వారని నల్లజాతీయులు తక్కువ వారనే  బేదం మొదటినుంచి సూచించే వారు..

అయితే మార్కెట్లో ఉన్న కొన్ని ఫేస్ క్రీమ్ ప్రాజెక్టులు ఈ భేదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని 22 ఏళ్ల పోరాటం మొదలుపెట్టింది.. స్క్రీన్ కలర్ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నా ఈ ప్రాడక్టులను నిషేధించాలని పోరాటం జరగగా చివరికి ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ దిగివచ్చి తమ కంపెనీ పేరు ని పేరును మార్చివేసింది.. కేవలం చందన హిరణ్ పోరాటం వలనే యూనిలివర్ పేరు మారుస్తుంది అని చెప్పలేం కానీ.. ఆ బ్రాండ్ ని, ఆ తరహా మెంటాలిటిని వ్యతిరేఖించిన కొన్ని వేల మందిలో చందన ఒకరు..యునిలివర్ ప్రకటణతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, తనకు తోడుగా వచ్చిన కొన్ని వేలమందికి ఈ సంధర్బంగా థాంక్యూ చెప్పింది..ఇకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ కొత్త పేరు ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: