స్త్రీలు తాము తల్లి కాబోతున్నాము అంటే చాలు ఇక అప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడుతుంది. కాబట్టి గర్భిణులుగా ఉన్నప్పుడు ఆహార విషయం లోనూ, ఆరోగ్యం పరంగానూ ఇలా అన్నిటిలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. మానసికంగా ఎటువంటి ఒత్తిడులకు లేకుండా ఆనందంగా ఉండటం, మనసుకు నచ్చే పనులు చేయడం, మంచి పోషకాహారాన్ని తీసుకోవడం, రెగ్యులర్ గా గైనకాలజిస్ట్ ను కలిసి హెల్త్ గురించి తెలుసుకోవడం వంటివి చేయడం వలన వారి బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. ఈ తొమ్మిది నెలలు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చిన స్త్రీలు బిడ్డకు జన్మనిచ్చేంత వరకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలను అదేవిధంగా తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇక్కడ గర్భిణీ లేడీస్ విషయంలో ఆహారం అనేది ప్రదానం. ఆహారం ఎక్కువ అయినా ప్రమాదమే అలాగే తక్కువ అయినా సమస్యే.  గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అలాగే నాణ్యమైన ఫ్యాట్స్ ను కూడా తీసుకోవాలి అని   న్యూట్రీషనిస్టులు చెబుతున్న మాట. గర్భిణీ సమయంలో స్త్రీలు బరువు పెరగడం సహజం అలాగని పరిమితికి మించి ఆహారం అధికంగా తిన్న కూడా మళ్ళీ డెలివరీ కష్టమయ్యే ప్రమాదం లేకపోలేదు అందుకే, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా జ్యూస్ లు అలాగే ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది. తద్వారా మరి ఎక్కువ పెరిగిపోకుండా సరైన బరువు ఉండేటట్టు చూసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ డైట్ లో తక్కువ ప్రోటీన్లు,
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే నాణ్యత ఉన్న ఫ్యాట్స్ లాంటివి తీసుకోవాలి. అంతేకానీ కళ్ళకు నచ్చిందల్లా తినకూడదు.

అదే విధంగా తక్కువ ఆహారాన్ని తీసుకున్న బిడ్డ పెరుగుదల లేకపోవడం  వంటి సంసులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. కాఫీ లు, టీ లు వంటివి అస్సలు తీసుకోకపోవడం మంచిది. అలాగే కూల్ డ్రింకులు కూడా తీసుకోకూడదని చెబుతున్నారు. ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. అలాగే జింక్, ఐరన్, విటమిన్ బి12, ఫోలేట్ లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని గర్భిణీలు తమ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు...ధూమపానం,మద్యపానం వంటివి అస్సలు చేయరాదు.  ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది. పచ్చి గుడ్లు అలాగే సీ ఫుడ్ కూడా తీసుకోకపోవడం శ్రేయస్కరం. ఈ జాగ్రత్తలను పాటించి పండంటి బిడ్డకు ప్రాణం పోయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: