వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన తినుబండారాలలో వెలగపండు కూడా ఒకటి. అయితే ఈ పండును చాలా మంది తినడానికి ఇష్ట పడరు. ఈ పండు రుచి అందరికీ నచ్చదు. అందులోనూ ఈ పండు మిగిలిన వాటిలా ఈజీగా కట్ చేసుకునో లేదా తొక్కను తీసి తినేయలేము, ఖచ్చితంగా పగల కొట్టి తినాల్సి ఉంటుంది. ఇలా పలు రకాల కారణాల వలన చాలా మంది ఈ పండును దూరం పెడుతుంటారు. అయితే ఈ పండు వల్ల కలిగే లాభాలు తెలిస్తే సీన్ రివర్స్ అయిపోతుంది. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. వెలగ పండులో ఉన్న ఔషద గుణాలు గురించి తెలిస్తే మీరు నేటి నుండే మీ రెగ్యులర్ పండ్ల జాబితాలో వెలగపండును చేర్చుకోక మానరు.

ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి ఈ పండు కొండంత మేలు చేస్తుంది. అయితే ఆ వివరాలేంటో వెలగ పండు ను మహిళలు  తప్పకుండా ఎందుకు తినాలో ఇపుడు చూద్దాం. వెలగ పండులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, మాలిక్, ఆక్సాలిక్, నియాసిస్, సిట్రిక్ ఆమ్లాలు అధికంగా ఉన్నాయని పలు పోషకాహార అధ్యయనాలు నిర్ధారించాయి. ఎటువంటి ప్రమాదకర జబ్బు బారిన మనం పడకుండా ఉండాలంటే వెలగపండు తప్పక తినాల్సిందే. అలాగే వెలగపండును తినడం చేత  జ్వరం, వాంతులు, విరేచనాలు వంటివి కూడా దరి చేరకుండా ఉంటాయట.

మహిళల్లో చాలా మందికి  నెలసరి సమస్య కారణంగా రక్త హీనత సమస్య ఉంటుంది. అయితే అలాంటి వారికి వెలగ పండు గుజ్జు గొప్ప ఔషధంలా పనిచేసి, రక్త హీనత సమస్య నుండి బయట పడేలా చేస్తుంది. అలాగే వెలగ పండును తినటం వలన గర్భాశయ, రొమ్ము, క్యాన్సర్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చు వాటికి చెక్ పెట్టొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకా ఆలోచించకండి.. వెంటనే వెలగపండును మీ ఆహారంలో చేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: