చలికాలంలో చర్మం పొడిబారడం తరచుగా పెరుగుతుంది. దీని కారణంగా ముఖం గరుకుగా కనిపించడం ప్రారంభిస్తుంది. నిర్మలమైన చర్మం అనేది ప్రతి ఒక్కరి కోరిక. దీనితో పాటు, చర్మం మెరుస్తూ, మృదువుగా ఉంటే మరింత అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖం చర్మం గరుకుగా, నిర్జీవంగా కనిపించడం చాలాసార్లు చూస్తూ ఉంటాము. ఇంట్లో ఉండే కొన్ని ఫేస్ ప్యాక్‌లు ముఖంలో కళను తిరిగి తీసుకురావడానికి మీకు సహాయపడతాయి. మరి ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

అరటిపండు, పాలతో చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకోవాలి. ఒక ప్యాక్ చేయడానికి పండిన అరటిపండును తీసుకొని బాగా మెత్తగా చేయాలి. తర్వాత దానికి ఒక చెంచా పచ్చి పాలు కలపండి. ఈ ఫేస్ ప్యాక్‌ని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు మూడు సార్లు వేసుకోవడం వల్ల చర్మంపై మెరుపును చూడవచ్చు.

చర్మం యొక్క కరుకుదనాన్ని తొలగించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఆలివ్ ఆయిల్‌లో మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే, అది ఖచ్చితంగా రాత్రిపూట దాని ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని అప్లై చేయడానికి ముందు రెండు పదార్థాలను కలపండి. వాటిని ఒక సీసాలో ఉంచండి. ఇప్పుడు రాత్రి పడుకొనే సమయంలో అప్లై చేయండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం కరుకుదనాన్ని తొలగిస్తుంది.

పెరుగును ఫేస్ ప్యాక్‌ గా అప్లై చేయడం ద్వారా చాలా వరకు పని చేస్తుంది. ముఖంపై ఉన్న గరుకును పోగొట్టాలంటే రెండు చెంచాల పెరుగు తీసుకుని, దానికి రెండు మూడు కుంకుమ పువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా గిలకొట్టి ముఖానికి పట్టించాలి. అది ఆరిపోయాక కడిగేయాలి. ముఖాన్ని శుభ్రంగా మరియు మెరిసేలా చేయడానికి ఇది చాలా సులభమైన మార్గం.

ముఖంపై గరుకుదనం ఎక్కువగా కనిపిస్తే క్యారెట్, టొమాటో రసం తీసి వాడాలి. ఈ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలపండి. ఈ జ్యూస్ మిశ్రమాన్ని ముఖమంతా రాసుకుని అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ముఖం కరుకుదనాన్ని తొలగించడానికి మీరు ఈ ఫేస్ ప్యాక్‌లలో దేనినైనా ఉపయోగించవచ్చు. కానీ మీకు ఏదైనా నిర్దిష్ట పదార్థానికి సంబంధించి అలెర్జీ ఉంటే, దానిని అప్లై చేసేముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: