సింగ‌ర్ మ‌నో ప్ర‌స్తుతం అన్ని రంగాల్లో బిజీ గా ఉన్న వ్య‌క్తి. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి న‌టుడుగా త‌ర్వాత సింగ‌ర్ గా అన్ని రంగాల్లో మంచి పేరు తెచ్చు కున్నారు. అలాగే ఇటీవ‌ల కాలంలో జ‌బ‌ర్ధ‌స్త్ అనే కామెడీ షో కు న్యాయ నిర్ణేత గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. డ‌బ్బింగ్ ఆర్టీస్ట్ గా ఇండ‌స్ట్రీ కి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం కూడా కొన్ని సినిమా ల‌కు డ‌బ్బింగ్ చెబుతారు. అలాగే సూప‌ర్ స్టార్ ర‌జిని కాంత్ కు కూడా తెలుగు సినిమా ల్లో మ‌నో డ‌బ్బింగ్ చెబుతారు. అలాగే సింగ‌ర్ గా కూడా మంచి పేరు తెచ్చు కున్నాడు. ఆయ‌న తెలుగు, త‌మిళ్, హింది, కన్న‌డ వంటి భాషాల్లో దాదాపు 25 వేల కు పైగా పాటు పాడారు. అలాగే ప‌లు సినిమాల‌ల్లో కూడా ముఖ్య మైన పాత్ర‌ల్లో న‌టించాడు.



 అయితే మ‌నో గా అంద‌రికి ప‌రిచ‌యం అయినా ఆయ‌న పేరు మాత్రం చాలా మందికి తెలియ‌దు. ఆయ‌న అస‌లు పేరు నాగూర్ బాబు. అయితే నాగూర్ బాబు అని ఎక్క‌డ కూడా త‌న పేరు న‌మోదు చేసు కోలేదు. మ‌నో అనే అంద‌రికి తెలుసు. అలాగే ఆయ‌న స్వ‌స్థ‌లం గుంటూర్ వ‌ద్ద ఉన్న స‌త్తుప‌ల్లి. మ‌నో ముస్లిం కుటుంబం లో జ‌న్మించాడు. ఆయ‌న ముస్లిం అని ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చాలా మందికి తెలియ‌దు. మ‌నో తండ్రి పేరు ర‌సూల్. ఆయ‌న ఆల్ ఇండియా రేడియో లో పని చేసే వాడు. అలాగే త‌ల్లి ష‌హీద. అయితే మ‌నో ముస్లిం కుటుంబం లో జ‌న్మించినా.. ఆయ‌న మ‌త‌సామ‌రస్యం చాలా ఎక్కువ. ఆయ‌న  ఎనాడు కూడా త‌ను ముస్లిం అని కాని హిందు అని కాని క్ట్రిస్టియ‌న్ అని చెప్ప‌లేదు. అయితే మ‌నో మ‌సీదు ల‌కు గుడిల‌కు చ‌ర్చీల‌కు వెళ్లి పూజ‌లు చేస్తాడు. అలా ప్ర‌తి మ‌తాన్ని కూడా మ‌నో గౌర‌విస్తాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: