జబర్దస్త్ షోతో కెరియర్ లో ఊపందుకున్న ఆర్టిస్ట్ లలో ఒకరు హైపర్ ఆది. మొదట టీం లో ఒక కంటెస్టెంట్ గా వచ్చి తన టాలెంట్ తో టీం లీడర్ గా మారి షోకే ప్లస్ అయ్యేంతగా గుర్తింపు పొందాడు. హైపర్ ఆది స్కిట్ వస్తుంది అంటే చాలు ఇక బుల్లితెర ప్రేక్షకులు టీవికి అతుక్కుపోతారు. ఆది కోసం షో చూసే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇతడు స్టేజ్ పైకి వస్తున్నాడంటే ఇక నాన్ స్టాప్ గా నవ్వడానికి ఆడియన్స్ తో పాటు జడ్జిలు కూడా రెడీ అవ్వాల్సిందే అంతగా అదిరిపోయే పంచులతో నవ్వులు పూలు పూయిస్తారు ఆది. ఇపుడు ఆది గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఆంధ్రలో ప్రకాశం జిల్లాకు ఈ చెందిన ఆది బీటెక్ చదివాడు. ఉద్యోగం మానేసి మరి జబర్దస్త్ షోకి వచ్చారు. ఈ షోతో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోలతో సైతం స్క్రీన్ పై సందడి చేస్తున్నారు ఆది.  నెలకు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు జబర్దస్త్ షో లో పారితోషికం అందుకుంటున్నారు ఈ కమెడియన్. హైదరాబాద్ లో మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఊర్లో కూడా మంచి ఇల్లు ఉంది. ఆదికి ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. ఆదికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు పేదరికంతో ఎంతో శ్రమించి తమను చదివించి పెద్ద చేసిన తండ్రికి ఎంత ఇచ్చినా తక్కువే అన్న భావంతో తండ్రికి అడగక ముందే అన్ని సౌకర్యాలను అందిస్తూ ఆనందిస్తారు ఆది.

ఇప్పుడు అలా అంచెలంచెలుగా ఎహ్డిగి ఫిలిం సర్కిల్స్ లోనూ తన పేరు మారుమ్రోగిపోతోంది. ఇప్పుడు అవకాశాలు మస్తుగా వస్తున్నాయని సమాచారం. త్వరలో ఒక సినిమాకు కూడా కథను అందించబోతున్నాడు ఆది అని తన ఫ్రెండ్స్ నుండి వినిపిస్తున్న మాట. సినీ స్టార్స్ సైతం హైపర్ ఆది స్కిట్ ల గురించి బాగా మాట్లాడుకుంటారు. వారిలో ఎవరో ఒకరు ఈ ఆఫర్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: