తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన తమిళ నటుడు ఆర్.జె.బాలాజీ రేడియో జాకీగా కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలాజీ.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో తక్కువ టైం లోనే ఎక్కువ పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. ఓ వైపు రేడియో జాకీగా చేస్తూనే మరో వైపు 'పుత్తగం' అనే తమిళ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పాడు. 2013లో రిలీజ్ అయిన హిట్ అందుకున్న ఈ చిత్రం తో బాలాజీకి గుర్తింపు లభించడమే కాకుండా ఇండస్ట్రీలో పరిచయాలు కూడా బాగా పెరిగాయి. దాంతో అలా ఏడాది తిరగకుండానే నటుడిగా మారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 'ఎదిర్‌ నీచల్‌' చిత్రం లో నటించి నటుడిగా మంచి మార్కులు కొట్టేశారు.

కాగా  2015లో వచ్చిన 'నానుమ్‌ రౌడీ దా' అనే చిత్రంతో ఈ నటుడి క్రేజ్ అమాంతం పెరిగింది. ఇటు తెలుగులోనూ అవకాశాలు అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  మహేష్ మూవీ  'స్పైడర్‌' లో బాలాజీ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా హిట్ కాకపోయినా నటులకు మంచి గుర్తింపు లభించింది. అదే విధంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయిన 'అమ్మోరు తల్లి',  'గ్యాంగ్' వంటి  సినిమాల్లోనూ నటించి పాపులర్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు బాలాజీ మాటలు విని అంతా షాక్ అయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ నుండి చాలామంది పూర్తిగా తేరుకోలేదు అంటే నమ్మండి. అంతగా అతడి వ్యాఖ్యలకు దిమ్మతిరిగింది.

ఇంతకీ విషయం ఏమిటంటే తనకు గే పాత్ర చేయాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అంతా అవాక్ అయ్యారు.  మోడ్రన్‌ లవ్‌ షో మొదటి సీజన్‌ చూశానని చెబుతూ.... ఆ షోలో ఓ గే జంట సరోగసి పద్దతి ద్వారా ఒక బిడ్డను కనాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వెబ్‌ సిరీస్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ షో కి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. నాకు కూడా కొందరు  గే ఫ్రెండ్స్‌ ఉన్నారు. అలాంటి యాంగిల్ లో ఓ పాత్ర చేయాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తో ఈ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: