ప్ర‌ముఖ  బైక్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో దీర్ఘకాలంగా నడిచే సిరీస్‌లో పల్సర్ ఒకటి.  బజాజ్ పల్సర్ కుటుంబంలో ఎంట్రీ లెవల్ 125 సిసి వెర్షన్‌ను విడుదల చేసింది. బజాజ్ కొత్త పల్సర్ 125 నియాన్ ను డ్రమ్ మరియు డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 


డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ .64,000 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ .66,618 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). ఈ ధర వద్ద కొత్త పల్సర్ 125 నియాన్ పల్సర్ 150 కన్నా రూ.20,000 ఎక్కువ సరసమైనది. డిజైన్ పరంగా, ఇది దాదాపు ఒకే విధంగా కనిపిస్తుంది.


అలాగే పల్సర్ 125 నియాన్ నియాన్ బ్లూ (మాట్టే బ్లాక్ బాడీపై), సోలార్ రెడ్ మరియు ప్లాటినం సిల్వర్ అనే మూడు రంగులలో లభిస్తుంది.  రెండు వేరియంట్లలోనూ 125సీసీ ఇంజిన్‌ అమర్చింది. గేర్‌లో ఉన్నప్పుడు కూడా స్టార్ట్‌ అయ్యే విధంగా రూపొందించిన ఈ బైక్‌కు 5–స్పీడ్‌ గ్రేర్‌బాక్స్‌ ఉన్నట్లు తెలిపింది. 


బరాజ్ ఆటో అధ్యక్షుడు సారంగ్ కనడే బైక్ గురించి మాట్లాడుతూ అత్యుత్తమ పనితీరు, శైలి మరియు థ్రిల్‌తో స్పోర్టి మోటార్‌సైకిల్‌ను అద్భుతమైన ధరతో అందిస్తున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా, పల్సర్ 125 ప్రవేశపెట్టడంతో, పల్సర్ బ్రాండ్ మార్కెట్లో కొనుగోలుదారులకు మరింత అందుబాటులో ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: