దేశీయ మార్కెట్ లో దూసుకెళ్తున్న మారుతి సుజుకి వాహనాలకు ఏ మోటార్ వెహికల్స్ కూడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. మారుతి నుండి వస్తున్న వెహికల్స్ కంప్యాక్ట్ ఎస్.యు.వి మోడల్స్ కు మంచి డిమాండ్ ఉంది. అందుకే మారుతి బ్రిజా సేల్స్ లో ముందుంది. అయితే మారుతి సుజుకి బ్రిజా కు పోటీగా టయోటా నుండి రైజ్ ను రిలీజ్ చేస్తుంది.


టయోటా నుండి వచ్చిన చిన్న కార్ల కన్నా పెద్ద కార్లు ఎక్కువ సేల్స్ కలిగి ఉన్నాయి. టయోటా ఇటియోస్ లివా, ఇటియోస్ సెడాన్ కార్లు వచ్చినా పెద్దగా సక్సెస్ అవలేదు. అందుకే టయోటా సరికొత్త రైజ్ ను సిద్ధం చేసింది. టయోటా రైజ్ నవంబర్ లో ఇంటర్నేషనల్ వైడ్ గా లాంచ్ చేస్తున్నారు.


ఇక ఇంజిన్ విషయానికి వస్తే 1.0 లీటర్ కెపాసిటీ కలిగిన 12 వాల్వ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో ఇది వస్తుంది. 98 బి.హెచ్.పి పవర్ ఇంకా 140.2 ఎన్.ఎం టార్క్ తో ఈ వెహికల్ వస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ వెహికల్ వస్తుంది. మరి మారుతి సుజుకి బ్రిజాకు పోటీగా వస్తున్న టయోటా రైజ్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: