ఇండియాలోనే నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి  దేశీయ ఇండియన్ మార్కెట్లో అమ్ముతున్న ఎస్-క్రాస్ క్రాసోవర్ ను మార్కెట్ నుండి తొలగించి వేసింది.మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్ విటారా  రావడంతో ఎస్-క్రాస్ క్రేజ్ పోయింది. చాలా కాలంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో జరగకపోవడంతో కంపెనీ ఈ మోడల్‌ని శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది.ప్రస్తుతం, మారుతి సుజుకి ఎస్-క్రాస్  చివరి స్టాక్ నెక్సా  డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతోంది. పెండింగ్ ఆర్డర్లను క్లియర్ చేసిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం. మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా ఈ మోడల్‌ను తొలగించివేశారు. దీన్నిబట్టి చూస్తుంటే, ఎస్-క్రాస్ ఇక తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఎస్-క్రాస్ స్థానాన్ని మారుతి సుజుకి తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఆధారంగా తయారు చేయబోయే బాలెనో క్రాస్‌తో రీప్లేస్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.సుజుకి ఎస్-క్రాస్ యూరప్ మార్కెట్లో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా ఉంది. కానీ, ఇది భారతదేశంలో మాత్రం కంపెనీ ఆశించిన సేల్స్ తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో, కంపెనీ ఈ మోడల్ ను భారత మార్కెట్ నుండి తొలగించాలని నిర్ణయించింది.


మారుతి సుజుకి భారతదేశంలో దాదాపు 1.7 లక్షల యూనిట్ల ఎస్-క్రాస్ ప్రీమియం క్రాస్‌ఓవర్‌లను విక్రయించింది. అయితే, ఇతర మారుతి సుజుకి కార్ల విక్రయాలతో పోలిస్తే, ఈ సంఖ్య చాలా తక్కువ.ఇండియన్ మార్కెట్లో వినియోగదారులు ఎస్‌యూవీలను ఇష్టపడినంతగా క్రాసోవర్ వాహనాలను ఇష్టపడలేదు.అందుకే, ఈ (క్రాసోవర్) విభాగంలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు విజయాలను సాధించలేకపోయాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మారుతి సుజుకి కూడా వచ్చి చేరింది. మారుతి సుజుకి ఎస్-క్రాస్ ముందు వైపు నుండి స్ట్రాంగ్ గా కనిపించినప్పటికీ, దాని వెనుక వైపు వ్యాగన్ లాంటి డిజైన్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే, ఎస్-క్రాస్ చూడచానికి చాలా వరకూ ఎస్‌యూవీ ఆకారంలోనే కనిపిస్తుంది. నిటారుగా ఉండే ఫ్రంటే ప్రొఫైల్ మరియు ఫ్లాట్‌గా కనిపించే బానెట్‌ వలన ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది .అందువల్ల మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. అంతే కాకుండా, అదనపు ఎస్‌యూవీ అప్పీల్ కోసం కొత్త సుజుకి ఎస్-క్రాస్ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ కూడా ఉంటుంది. లోపలి భాగంలో యాపిల్ కార్‌ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో పాటుగా అనేక ఇతర సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: